ETV Bharat / bharat

బంగాల్​లో రథయాత్ర రూటు మార్చిన భాజపా

బంగాల్​లో భాజపా చేపట్టిన పరివర్తన యాత్రను ముర్షీదాబాద్ జిల్లాలో పోలీసులు అడ్డుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలున్నందున భాజపా ప్రచార రథాన్ని బెల్దంగాలోకి ప్రవేశించేందుకు అనుమతించలేదు. దీంతో ప్రత్నామ్నాయ మార్గం ద్వారా రథయాత్రను కొనసాగించారు భాజపా నాయకులు. పోలీసుల తీరుపై మండిపడ్డారు.

BJP changes route after cops stop rath from entering sensitive areas in Bengal's Murshidabad
బంగాల్​లో రథయాత్ర రూటు మార్చిన భాజపా
author img

By

Published : Feb 8, 2021, 4:03 PM IST

బంగాల్​లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 'పరివర్తన యాత్ర' పేరుతో రథ యాత్రను చేపట్టింది భాజాపా. అయితే ముర్షీదాబాద్​ జిల్లాలోకి ప్రవేశించిన కమలనాథుల రథాన్ని పోలీసులు అడ్డుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలున్నందున జిల్లాలోని బెల్దంగాలోకి ప్రవేశించేందుకు అనుమతి నిరాకరించారు. దీంతో మరో దారి లేక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుని రథ యాత్రను ముందుకు సాగించారు భాజపా నాయకులు.

పోలీసులపై మండిపాటు..

బెల్దంగాలో రథయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై జిల్లా భాజపా నాయకులు గౌరీశంకర్​ ఘోష్ మండిపడ్డారు. యాత్ర కోసం అనుమతి కోరినప్పుడే ఇక్కడ ప్రచారం నిర్వహిస్తామని రూట్​మ్యాప్​లో పొందుపరిచామని చెప్పారు. అప్పుడు ఎలాంటి అభ్యతరం చెప్పకుండా.. ఇప్పుడు అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు.

పోలీసుల తీరు తమకు ఆశ్చర్యాన్ని కల్గించిందని బంగాల్ రాష్ట్ర భాజపా నేత కల్యాణ్​ చౌబే అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగాల్​లో భాజపా చేపట్టిన రథయాత్రను ఈనెల 6న ప్రారంభించారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించేందుకు దీన్ని చేపట్టారు. ప్రధాని మోదీ సహా, పార్టీలోని ప్రముఖుల ఫొటోలతో ఉన్న ఏసీ వ్యానులను రథాలుగా మార్చారు. రానున్న రోజుల్లో బంగాల్​లోని 294 నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా మరో 4 రథాలను భాజపా కేంద్ర నాయకులు ప్రారంభించనున్నారు.

ఇదీ చూడండి: ప్రచార పర్వం: భాజపా రథయాత్ర- ర్యాలీతో టీఎంసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.