ETV Bharat / bharat

'గాంధీ'ల కోసం వచ్చేవారం లోక్​సభలో 'ప్రత్యేక' బిల్లు

మాజీ ప్రధాన మంత్రుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణ దళం (ఎస్​పీజీ) భద్రతను ఉపసంహరిస్తూ స్పెషల్ ప్రొటెక్షన్​ గ్రూప్ చట్టానికి సవరణలు చేయనుంది కేంద్రం. ఈ నిర్ణయానికి కేంద్రమంత్రివర్గం ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. సంబంధిత బిల్లును వచ్చేవారం లోక్​సభలో ప్రవేశపెట్టనున్నామని కేంద్రమంత్రి అర్జున్​రామ్ మేఘవాల్ తెలిపారు.

'గాంధీ'ల కోసం వచ్చేవారం లోక్​సభలో 'ప్రత్యేక' బిల్లు
author img

By

Published : Nov 22, 2019, 3:07 PM IST

ఎస్​పీజీ చట్ట సవరణ బిల్లును వచ్చేవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మాజీ ప్రధాన మంత్రుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక రక్షణ దళం (ఎస్​పీజీ) కమాండోల భద్రత కల్పించరాదని ఈ బిల్లులో పేర్కొన్నట్లు తెలిపాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ఇటీవలే కేంద్రమంత్రివర్గం ఆమోదించినట్లు చెప్పాయి.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ఎస్​పీజీ భద్రత తొలగింపు నేపథ్యంలో ఈ చట్ట సవరణ చేస్తోంది కేంద్రం.

ప్రస్తుత చట్టం ఇలా...

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ చట్టం ప్రకారం ప్రధానమంత్రి, మాజీ ప్రధాని సహా వారి కుటుంబాలకు ఎస్​పీజీ రక్షణ కల్పిస్తారు. మాజీ ప్రధాని కుటుంబ సభ్యులకు.. పదవి నుంచి తప్పుకున్న ఏడాది కాలం వరకు, ముప్పు పొంచి ఉందన్న అంచనాలతో అంతకుమించిన సమయం ఈ ప్రత్యేక భద్రతను ఇప్పటివరకు కల్పిస్తున్నారు.

నిశిత పరిశీలన తర్వాతే గాంధీలకు తగ్గింపు

మాజీ ప్రధాని దివంగత రాజీవ్​ గాంధీ కుటుంబసభ్యులకు ప్రమాదం పొంచి ఉందా అన్న అంశమై ఈ నెల ప్రారంభంలో హోంశాఖ అధికారులు నిశితంగా పరిశీలించినట్లు సమాచారం. అనంతరమే గాంధీలకు ఎస్​పీజీ భద్రతను ఉపసంహరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జెడ్‌ ప్లస్‌ కేటగిరీలో సీఆర్​పీఎఫ్​తో గాంధీ కుటుంబానికి భద్రత కల్పిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాత్రమే ఇప్పుడు ఎస్​పీజీ భద్రతా వలయంలో ఉన్నారు.

ఎస్​పీజీ బృందంలో సుశిక్షితులైన భద్రతా సిబ్బందితో పాటు, అధునాతన వాహనాలు, జామర్లు, అంబులెన్స్ వాహన శ్రేణిలో ఉంటాయి.

ఇదీ చూడండి: కశ్మీర్​లో వరుసగా మూడో రోజూ బంద్

Muzaffarpur (Bihar), Nov 22 (ANI): 17 camels were rescued by Muzaffarpur Police from Kranti area. Out of 17, one has died while three are in critical condition. Speaking on it, SDO of Muzaffarpur (East) Kundan Kumar said, "Regular treatment for all the camels is underway. We are taking care of them. We cannot shift them anywhere because it will be dangerous for them."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.