ETV Bharat / bharat

ఆకులపై చిత్రాలు గీసి ఔరా అనిపిస్తున్న 'మిట్టూ' - రాజస్థాన్​లోని బీకానేర్

అందరికీ ప్రతిభ ఉంటుంది. కానీ అది గుర్తించి మెరుగుపరుచుకున్న వారే ఉన్నత శిఖరాలను చేరుకుంటారు. ఇందుకు ఉదాహరణ. రాజస్థాన్​లోని బీకానేర్​కు చెందిన మిట్టూ మేహ్రా అనే యువతి. చెట్ల ఆకులపై స్వాతంత్ర సమర యోధులు, ప్రముఖుల చిత్రాలను గీసి అందరితో ఔరా అనిపించుకుంటోంది.

bikaner-artist-mitthu-mehra-creates-unique-drawings-on-tree-leaves
'ఆకులపై చిత్రాలతో' ఔరా అనిపించుకుంటోన్న 'మిట్టూ'
author img

By

Published : Feb 5, 2021, 4:50 PM IST

చెట్ల ఆకులపై వివిధ కళాకృతులు, ప్రముఖుల చిత్రాలు గీసి అందరినీ అబ్బురపరుస్తోంది రాజస్థాన్​ బీకానేర్​కు చెందిన మిట్టూ మెహ్రా అనే యువతి.

'ఆకులపై చిత్రాలతో' ఔరా అనిపించుకుంటోన్న 'మిట్టూ'

చిన్నప్పటి నుంచి మెహ్రాకు చిత్రకళపై ఎనలేని మక్కువ. ఆ ఇష్టంతోనే ఆమె రకరాకల బొమ్మలు గీసేది. ఇప్పుడు చెట్ల ఆకులపై స్వాతంత్ర సమరయోధులు, ప్రముఖుల చిత్రాల్ని గీసి అందరి మన్ననలు పొందుతోంది.

bikaner-artist-mitthu-mehra-creates-unique-drawings-on-tree-leaves
చెట్టు పత్రంపై నేతాజీ చిత్రం

పత్రంపై రాముని చిత్రం

ఆకులపై చిత్రాల్ని గీస్తోన్న మిట్టూ మెహ్రా

ఆకులపై ప్రముఖుల చిత్రాలు

చిత్రలేఖనంపై ఉన్న ఇష్టంతో చిత్రకళలో మాస్టర్​ డిగ్రీ చేసింది. అంతేకాకుండా చాలా మంది చిన్నారులకు పెయింటింగ్​ వేయడం నేర్పుతోంది.

"చిన్నప్పటినుంచి నాకు చిత్రాలు గీయడం అంటే చాలా ఇష్టం. అయితే విభిన్నంగా గీయాలని అనుకున్నాను. అందుకే చెట్ల ఆకులపై ఇలా చిత్రాల్ని గీశాను. ఇందుకోసం సామాజిక మాధ్యమాలలో, వేరువేరు చోట్ల వెతికాను. చిత్రకళపై ఉన్న ఆసక్తితో ఈ రంగంలో మాస్టర్​ డిగ్రీ కూడా చేశాను. చాలా మంది పిల్లలకు బొమ్మలు గీయడం నేర్పుతున్నాను. చుట్టు పక్కల ఎవరైనా ఇలా ఆకులపై పెయింటింగ్​ వేస్తున్నారో లేదో తెలియదు. నేను వేసిన ఈ పెయింటింగ్స్​ చూసి అందరూ మెచ్చుకుంటున్నారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే అందరి నుంచి అందే ఫీడ్​ బ్యాక్​తో నా కళను ఇంకా మెరుగుపరుచుకుంటాను."

-మిట్టూ మెహ్రా, పెయింటర్​

ప్రతి వ్యక్తిలోనూ ప్రతిభ ఉంటుంది. కానీ దాన్ని గుర్తించి, మెరుగుపరుచుకుంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. అందుకు ఉదాహరణ మిట్టూ మెహ్రా అని చెప్పవచ్చు.

ఇదీ చూడండి: కళాకారుడి సందేశం- చెట్టు కాండంపై మోదీ చిత్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.