ETV Bharat / bharat

బిహార్​ బరి: కాంగ్రెస్​పై మైనార్టీల గుస్సా- ఎందుకు ?

బిహార్​ ఎన్నికలకు పార్టీలన్నీ పక్కా వ్యూహాలతో, పదునైన అస్త్రాలతో, విజయంపై ధీమాతో బరిలోకి దిగుతున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా నిలిచే కుల సమీకరణల లెక్కలు తప్పకుండా అడుగులేస్తున్నాయి. ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్​కు మైనార్టీలైన ముస్లింల ఓట్లు.. కీలకంగా ఉంటాయి. అయితే, ప్రస్తుత బిహార్​ శాసనసభ ఎన్నికలకు ముందు.. మైనార్టీల నుంచి కాంగ్రెస్​ పట్ల అసంతృప్తి గళం వినిపిస్తోంది. పార్టీ ఈ వర్గంలో మద్దతు కోల్పోయిందన్న వాదన కనిపిస్తోంది.

minorities-by-congress
బిహార్​ బరి: మైనార్టీల నుంచి కాంగ్రెస్​కు అసంతృప్తి సెగ.. ఎందుకు ?
author img

By

Published : Oct 13, 2020, 1:23 PM IST

బిహార్​ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్​ అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఈ జాబితాలో ఒక్క మైనార్టీ అభ్యర్థి పేరు కూడా కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే లౌకికవాద కాంగ్రెస్​.. ఆ వర్గాన్ని సీట్ల కేటాయింపులో పట్టించుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్​ పార్టీపై.. మైనార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్​ విశ్వసనీయత కోల్పోయింది. ఇక్కడ పార్టీ​ వరుసగా ఓటమి పాలవుతోంది. అదే సమయంలో జేడీయూ, ఆర్జేడీ పుంజుకుంటున్నాయి. కాంగ్రెస్​ లేకుండానే పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్​ పార్టీ మైనార్టీల్లో నమ్మకం కోల్పోతోంది.

-షామిమ్ హసన్​, పట్నా వాసి

కాంగ్రెస్​ పార్టీ మైనార్టీలను బానిసల్లాగా చూస్తోంది. పార్టీ చెప్పినట్లుగా వారు ఆడతారని భావిస్తోంది. ప్రస్తుతం మైనార్టీలను వారెలా చిన్నచూపు చూస్తున్నారో కనిపిస్తోంది. ఇప్పుడు ఓటర్లు తెలివిగా అడుగులు వేస్తారు.

-మహ్మద్​, పట్నా వాసి

no-ticket-to-minorities
మైనార్టీల నుంచి కాంగ్రెస్​కు అసంతృప్తి సెగ

గతంలో కాంగ్రెస్​వైపే..

ఎన్నో ఏళ్లుగా బిహార్​లోనే కాకుండా.. దేశవ్యాప్తంగా మైనార్టీలు కాంగ్రెస్​కే మద్దతుగా ఉన్నారు. బిహార్​లో లాలూ ఎంట్రీ తర్వాత.. ముస్లిం ఓటర్లు ఆయనవైపు మళ్లారు. అనంతరం లాలూ ఆర్జేడీ-కాంగ్రెస్​ కలిసి పోటీలో దిగుతున్న నేపథ్యంలో గంపగుత్తగా మైనార్టీల ఓట్లు ఈ కూటమికే పడేవి. సీట్ల కేటాయింపుల్లోనూ పార్టీలు ఈ వర్గానికి పెద్దపీట వేసేవి. అయితే, 2020 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్​ జాబితా అందుకు భిన్నంగా ఉంది.

తాజా ఎన్నికల్లో మహాకూటమి పొత్తుల్లో భాగంగా.. కాంగ్రెస్​ పార్టీ 70 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. కూటమిలో ప్రధాన పక్షంగా ఉన్న ఆర్జేడీ 144 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. వామపక్షాలకు 29 సీట్లు కేటాయించారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: ఆర్జేడీ-144, కాంగ్రెస్​-70 స్థానాల్లో పోటీ

ప్రాధాన్యం ఉంటుంది..

తొలి జాబితాలో మైనార్టీలకు స్థానం లేకపోవటంపై స్పందించిన కాంగ్రెస్.. పొత్తులో భాగంగా కేటాయించలేకపోయామని, మలి జాబితాల్లో అత్యధికంగా మైనార్టీలను బరిలోకి దించుతామని చెబుతోంది.

పొత్తు కారణంగా.. మొదట దశకు సంబంధించిన 27మంది అభ్యర్థులనే ప్రకటించాం. రెండు, మూడో దశ పోలింగ్​కు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం.

-ప్రేమ్​చంద్​ మిశ్రా, బిహార్​ కాంగ్రెస్​ నేత

ఇదీ చూడండి: బిహార్​ ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్​ అగ్రనేతలు

congress
శక్తిసిన్హ్ గోహిల్​

ప్రత్యర్థుల విమర్శలు

ఇదే అదునుగా ఇతర పార్టీలు.. కాంగ్రెస్​ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. సీట్ల పంపకంలో మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చిన జేడీయూ.. ఇన్నాళ్లూ లౌకికవాదం పేరుతో కాంగ్రెస్​ ముస్లింలను మోసం చేసిందని దుయ్యబట్టింది. తమ పార్టీ తరఫున 10% సీట్లు కేటాయించామని చెప్పుకొచ్చింది. అన్ని పార్టీలు ముస్లింలను వంచించాయని.. తాము మాత్రమే వారికి న్యాయం చేయగలమని ఆర్ఎల్​​ఎస్పీ అధినేత ఉపేంద్ర కుష్వాహా అంటున్నారు.

ఇదీ చూడండి: బిహార్​ బరి: జేడీయూ​ ఎత్తులు.. ఎన్డీఏను గట్టెక్కిస్తాయా ?

Bihar polls
బిహార్ ఎన్నికలకు సర్వం సిద్ధం

మొత్తం రాష్ట్రంలోని ఓటర్లలో 16% ఉన్న ముస్లింలు.. కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలో క్రియాశీలకంగా ఉన్నారు.

243 స్థానాలున్న బిహార్ అసెంబ్లీకి మొదటి విడత పోలింగ్​.. అక్టోబర్​ 28న జరగనుంది.

ఇదీ చూడండి: 'బిహార్​లో అప్పటివరకు ఎగ్జిట్ పోల్స్​పై నిషేధం'

ఇదీ చూడండి: 40 ఏళ్లలో లాలూ లేకుండా తొలిసారి బిహార్ ప్రచార పర్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.