బిహార్ హాజీపుర్లోని కొందరు దుండగులు సినీఫక్కీలో పట్టపగలే ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో దూరి బంగారాన్ని దోచుకున్నారు. 55 కేజీల ఈ బంగారం విలువ సుమారు రూ.21 కోట్ల విలువైన ఉంటుందని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సినీ ఫక్కీలో..
ఎనిమిది మంది దుండగులు ఖాతాదారుల మాదిరిగా ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలోకి వెళ్లారు. ఒక్కసారిగా తుపాకీలు తీసి కాపలాదారుని తలకు గురిపెట్టారు. ఈ హఠాత్తు పరిణామంలో అక్కడ ఉన్నవారంతా భయపడిపోయారు. మేనేజర్ తలకు గన్తో గురిపెట్టిన దుండగులు అందినంత బంగారం దోచుకెళ్లారు.
ముత్తూట్ కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై కేసు నమోదుచేశారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇదీ చూడండి: 1978లో పవార్ ఇలాగే చేశారు..!