ETV Bharat / bharat

బిహార్​లో కాంగ్రెస్ ఖాళీ- ఎన్డీఏలోకి ఎమ్మెల్యేలు! - bihar politics

బిహార్​లో 11మంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు త్వరలో ఎన్డీఏలో చేరబోతున్నారని ఆ పార్టీ నేత భరత్​ సింగ్ తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్​మోహన్​ ఝా, రాజ్యసభ ఎంపీ అఖిలేశ్​ ప్రసాద్ సింగ్​ కూడా పార్టీని వీడనున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ పరిస్థితి 'కోమా' స్టేజ్​లో ఉందని జేడీయూ నేత రాజీవ్ రంజన్​ విమర్శించారు. ఆ పార్టీని ముందుకు నడిపే నాయకుడే కరవయ్యారని ఎద్దేవా చేశారు.

11-party-mlas-in-bihar-will-resign-claims-cong-leader
బిహార్​లో కాంగ్రెస్ ఖాళీ- ఎన్డీఏ గూటికి 11మంది ఎమ్మెల్యేలు!
author img

By

Published : Jan 6, 2021, 5:29 PM IST

బిహార్​లో కాంగ్రెస్ పరిస్థితి అత్యంత దయనీయంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు త్వరలోనే ఎన్డీఏ గూటికి చేరుకుంటారని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భరత్​ సింగ్​ చెప్పారు. కాంగ్రెస్​ రాష్ట్ర అధ్యక్షుడు మదన్​ మోహన్​ ఝా, రాజ్యసభ ఎంపీ అఖిలేశ్​ ప్రసాద్ సింగ్, సీనియర్ నేత సదానంద్ సింగ్​ కూడా పార్టీని వీడనున్నారని వెల్లడించారు. ఎన్నికల్లో ఆర్జేడీతో పొత్తు వద్దని తాను ముందు నుంచే చెబుతున్నా పట్టించుకోలేదని, బిహార్​లో కాంగ్రెస్​ పరిస్థితిపై అధిష్ఠానానికి ఎప్పుడూ తప్పుడు సమాచారమే వెళ్లిందని భగత్​ సింగ్ అన్నారు.

కాంగ్రెస్​ను వీడనున్న 11మంది ఎమ్మెల్యేలు ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారేనని భగత్ సింగ్​ తెలిపారు. వారంతా డబ్బులిచ్చి టికెట్లు పొందారని ఆరోపించారు. మదన్​ మోహన్​ ఝా, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, సదానంద్ సింగ్​.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని అన్నారు.

కోమాలో ఉంది..

భగత్ సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ నేత రాజీవ్​ రంజన్​ స్పందించారు. బిహార్​లో కాంగ్రెస్​ది 'కోమా' పరిస్థితి అని విమర్శించారు. ఆ పార్టీని ముందుకు నడిపించేందుకు నాయకులే లేరని ఎద్దేవా చేశారు. అందుకే కాంగ్రెస్ బిహార్ ఇంఛార్జ్ శక్తి సింగ్​ గోహిల్​ పదవి నుంచి తప్పించమని కోరుతున్నారని తెలిపారు.

ఎందరొస్తారో తెలియదు..

కొంతమంది కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు త్వరలోనే ఎన్డీఏలో చేరతారని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత రామ్ కృపాల్​ యాదవ్​ తెలిపారు. అయితే ఎంత మంది అనే విషయం తెలియదన్నారు. ఈ నెలాఖరు వరకు వారంతా ఎన్డీఏ తీర్థం పుచ్చుకుంటారని చెప్పారు. ఈ విషయం బిహార్ కాంగ్రెస్ ఇంఛార్జ్​ శక్తి సింగ్ గోహిల్​కు కూడా తెలుసన్నారు. అందుకే పదవి నుంచి తప్పించమని కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆయన లేఖ రాశారని పేర్కొన్నారు.

గతేడాది నవంబర్​లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, వామపక్షాలతో కలిసి మహాకూటమిగా బరిలోకి దిగింది కాంగ్రెస్. 70 స్థానాల్లో పోటీ చేసి కేవలం 19 సీట్లే గెలిచింది. ఇప్పుడు వారిలో 11మంది పార్టీని వీడతారని ప్రచారం జరుగుతోంది.

ఇదీ చూడండి: వర్షం, చలిని బేఖాతరు చేస్తూ రైతుల ఆందోళనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.