ETV Bharat / bharat

భారతీయుల్లో ఏటేటా పెరుగుతున్న అసంతృప్తి! - ఆర్థికం

దేశం​లో జరుగుతున్న పరిణామాలపై భారతీయలు 55 శాతం మంది సంతోషంగా ఉన్నారని ప్యూ పరిశోధన సంస్థ నివేదిక వెల్లడించింది. అయితే  ప్రజా సంతృప్తి 15 పాయింట్లు తగ్గి 70శాతానికి పడిపోయిందని సర్వే తెలిపింది.

అమెరికాలోని  ప్రవాస భారతీయుల్లో సంతోషం
author img

By

Published : Mar 26, 2019, 10:46 AM IST

భారత్​లో 2017 సంవత్సరానికి ప్రజా సంతృప్తి 15 పాయింట్లు తగ్గి 70 శాతానికి చేరిందని అమెరికాకు చెందిన ప్యూ పరిశోధన సంస్థ వెల్లడించింది. అయినప్పటికీ భారత్​లో జరుగుతున్న తాజా పరిణామాలపై 55 శాతం మంది సంతోషంగానే ఉన్నారు. సోమవారం విడుదలైన ప్యూ సర్వే నివేదిక ఈ విషయాలను వెల్లడించింది.

2018 మే 23 నుంచి జులై 23 మధ్య 2,521 మందిని సర్వే చేశారు. ఇది పుల్వామా దాడి కంటే చాలా కాలం ముందే జరిగింది. 76 శాతం మంది భారతీయలు మన దేశానికి ఉగ్రవాదం, పాకిస్థాన్​తో పొంచి ఉన్న ప్రమాదంపై ఆందోళన వ్యక్తం చేశారు. 7 శాతం మాత్రమే వ్యతిరేక అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆర్థిక పరిస్థితి మెరుగే: 65 శాతం మంది

సగటు భారతీయుడి ఆర్థిక పరిస్థితి 20 సంవత్సరాల క్రితం కంటే మెరుగ్గా ఉందని మూడింట రెండొంతుల మంది (65 శాతం) అభిప్రాయపడ్డారు. కేవలం 15 శాతం పరిస్థితి ఇంకా దిగజారిందన్నారు.

నిరుద్యోగమే భారత్​కు అతిపెద్ద సవాలని సర్వే నివేదిక ఇచ్చింది. 76 శాతం ఉద్యోగాలు కల్పించటం మన దేశానికి పెద్ద సమస్య అని, గత సంవత్సరం నుంచి పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చిందని తెలిపారు. ఐదుగురిలో ఒక్కరు మాత్రమే (21 శాతం) ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయని అభిప్రాయపడగా.. 67 శాతం మంది పరిస్థితి దిగజారిందన్నారు. భారత్​కు ధరల పెరుగుదల అతిపెద్ద సమస్య అని 73 శాతం మంది భావిస్తున్నారు. 65 శాతం మంది ధరల పరిస్థితి దారుణంగా మారిందన్నారు.

నేతలు అవినీతి పరులే : ప్రవాసులు

భారత రాజకీయ నాయకుల్లో ఎక్కువ మంది అవినీతిపరులని 64 శాతం మంది భారతీయులు చెప్పగా.. 43 శాతం మంది దీనికి గట్టి మద్దతిచ్చారు. 10 మందిలో ఏడుగురు(69 శాతం) భాజపా, కాంగ్రెస్​ మద్దతుదారులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఎన్నికల్లో ఎవరు గెలిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పు ఉండదని 58 శాతం అభిప్రాయపడ్డారు. ఇందులోనూ భాజపా, కాంగ్రెస్​ మద్దతుదారులు ఉన్నారు.

భారతదేశానికి వాణిజ్యం మంచిదని 71 శాతం మంది అభిప్రాయపడ్డారు. వాణిజ్యం వల్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని.. 18 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్యనున్న వారిలో 59 శాతం భావించారు. 50 ఏళ్ల వయస్సు కంటే ఎక్కువ ఉన్న వారిలో 50 శాతం మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.