ETV Bharat / bharat

బెంగళూరు అల్లర్ల కేసులో సంపత్​ రాజ్​ అరెస్టు

author img

By

Published : Nov 17, 2020, 8:34 AM IST

బెంగళూరు అల్లర్ల కేసులో కాంగ్రెస్​ మాజీ మేయర్​ సంపత్​ రాజ్​ను పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల కొవిడ్​ చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన సంపత్​.. అక్కడి నుంచి తప్పించుకు పారిపోయారు.

Bengaluru violence case: former Congress mayor R Sampath Raj arrested
బెంగళూరు అల్లర్ల కేసులో మాజీ మేయర్​ అరెస్ట్​

కర్ణాటక బెంగళూరు అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్​ మాజీ మేయర్​ సంపత్​ రాజ్​ను పోలీసులు అరెస్టు​ చేశారు. ఇటీవల కరోనాతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన... కొందరి సాయంతో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.

సంపత్ తప్పించుకోవడానికి సహకరించిన రియాజుద్దీన్​ సహా మరో కాంగ్రెస్ కార్పోరేటర్​ అబ్దుల్​ రాకీబ్​ జాకీర్​ను కూడా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. సంపత్​కు మైసూర్​లోని నాగరహోళిలో జాకీర్​ ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు తెలిపారు. జాకీర్​కు కూడా బెంగళూరు అల్లర్లతో సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.

ఈ ఏడాది ఆగస్టు 11న నగరంలో జరిగిన అల్లర్లతో సంపత్​కు సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ అల్లర్లలో దేవరహళ్లి, కడుగొండనాహళ్లి పోలీసు స్టేషన్లను​ తగలబెట్టారు ఆందోళనకారులు. ఈ హింసాత్మక అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: మా భావజాలమే పార్టీని గట్టెక్కిస్తుంది: గహ్లోత్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.