కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి విజయకు పిల్లులంటే చాలా ఇష్టం. ఆకలికి అలమటిస్తోన్న పిల్లులను చూసినా, గాయాలతో ఉన్న పిల్లులను చూసినా ఆమె మనసు చలించిపోయేది. దీంతో, పిల్లులను రక్షించడానికి 2014లో ప్రత్యేకంగా ఓ ఎన్జీఓ ఏర్పాటు చేసింది. అనంతరం వందలాది పిల్లులను రక్షించి జంతువుల నేస్తంగా మారింది. ఎన్జీఓ ఏర్పాటులో భాగంగానే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జంతువులను కాపాడాలని చెబుతోంది.
పిల్లులను రక్షిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోన్న విజయ 'ఈటీవీ-భారత్'తో తన అనుభవాలను పంచుకుంది.
"పిల్లులను రక్షించి వాటిని దత్తతకు ఇచ్చేందుకు ఎన్నో క్యాంప్లు ఏర్పాటు చేశాను. కొంతమంది.. నల్ల పిల్లులు చెడుకు సంకేతం అని భావిస్తారు. కానీ, వాటికి అది పుట్టుకతో వచ్చే రంగు మాత్రమే. మంచి చెడు అనేది వర్ణంలో ఉండవు. అందుకే రంగును బట్టి పిల్లులను తక్కువగా చూడకూడదు".
- విజయ, ఎన్జీఓ వ్యవస్థాపకురాలు.
" ఇప్పటివరకు దాదాపు 2000 పిల్లులను కాపాడాం. ఎన్జీవోకి వచ్చే ప్రతీ పైసా పిల్లుల కోసమే ఖర్చు చేస్తాం. 'సమర్పన్ చారిటీ ట్రస్ట్' వారు కూడామా ఎన్జీవోతో భాగస్వామ్యం అయ్యారు".
- సంజన, వలంటీర్.
ఇదీ చదవండి:క్యాన్సరా? నీటి శాతం తగ్గితే ప్రమాదమే