ETV Bharat / bharat

ప్రధాని ఎంత చెబుతున్నా కరోనా భయాలు బేఖాతరు! - మార్కెట్​లో వందలాది జనం

పండుగల వేళ కరోనా భయాలను బేఖాతరు చేస్తూ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడుతున్న సంఘటనలు పెరిగిపోయాయి. దసరా సందర్భంగా బెంగళూరు కేఆర్​ మార్కెట్​కు వందలాది మంది తరలివచ్చారు. మాస్క్​లు లేకుండా, భౌతికదూరం పాటించకపోవటం ఆందోళన కలిగించే విషయం. బీబీఎంపీ మార్షల్స్​ రంగంలోకి దిగినా నియంత్రించలేకపోయారు.

Crowded KR Market
బెంగళూరు ఆర్​కే మార్కెట్​
author img

By

Published : Oct 25, 2020, 12:11 PM IST

దేశంలో కరోనా మహమ్మారి కొనసాగుతున్న వేళ తగు జాగ్రత్తలు పాటిస్తూ పండుగలు జరుపుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా.. మాస్క్​లు ధరించటం, భౌతిక దూరం పాటించాలని పలు సందర్భాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలను కోరారు. అయినా.. కొవిడ్​ నిబంధనలు బేఖాతరు చేస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి సంఘటనే బెంగళూరు కేఆర్​ మార్కెట్​లో కనిపించింది.

మార్కెట్​లో వందలాది మంది జనం

ప్రస్తుతం దేశవ్యాప్తంగా దసరా-దీపావళి పండుగ సీజన్​ నడుస్తోంది. పండుగల వేళ గృహోపకరణాలు, ఫోన్లు, దుస్తులు సహా ఇతర వస్తువల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు ప్రజలు. ఈ క్రమంలోనే బెంగళూరు కేఆర్​ మార్కెట్​కు వందలాది మంది తరలిరావటంతో రద్దీగా మారింది. చాలా మంది మాస్కులు లేకుండా కనిపించటం గమనార్హం. భౌతిక దూరం నిబంధన మచ్చుకైనా కనిపించలేదు.

రంగంలోకి బీబీఎంపీ మార్షల్స్​..

మార్కెట్​కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావటం వల్ల బృహత్​ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) మార్షల్స్​ రంగంలోకి దిగారు. కానీ, వారు కూడా నియంత్రించలేకపోయారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వైరస్​ వ్యాప్తికి ఆజ్యం..

దేశంలో కరోనా ఉద్ధృతి ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే.. పండుగల వేళ ఇలా నిర్లక్ష్యం వహిస్తే.. వైరస్​ వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చూడండి: భీతి గొలుపుతున్న కొవిడ్‌ వ్యర్థాలు- అప్రమత్తత అత్యవసరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.