ETV Bharat / bharat

బంగాల్​లో ప్రచార వేడి- నడ్డా, దీదీ మాటల యుద్ధం

author img

By

Published : Feb 9, 2021, 5:27 PM IST

బంగాల్​లో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. దీదీ పాలనలో బంగాల్ సంస్కృతి ప్రమాదంలో పడిందని భాజపా ఆరోపించింది. రాజకీయాలను దీదీ సర్కార్ నేరపూరితంగా మార్చేసిందని మండిపడింది. భాజపాపై ప్రతిదాడికి దిగిన మమత... బంగాల్​లో మత విభజన ఉండదని, అన్ని వర్గాల ప్రజలు సామరస్యంగా కలిసే ఉంటారని చెప్పారు. భాజపా పాలిత రాష్ట్రాలతో పోలిస్తే బంగాల్​లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయన్నారు.

bengals-culture-under-threat-in-mamatas-rule-nadda tmc supremo hits back bjp
బంగాల్​లో ప్రచార వేడి- నడ్డా, దీదీ మాటల యుద్ధం

బంగాల్ అధికార పార్టీ టీఎంసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బంగాల్ ​సంస్కృతికి మమతా బెనర్జీ పాలనలో ముప్పు వాటిల్లిందని ధ్వజమెత్తారు. బయటి వ్యక్తులు, లోపలి వ్యక్తులు అంటూ సమాజాన్ని విడదీయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

బీర్భూమ్​ జిల్లాలోని తారాపీఠ్ నుంచి పరివర్తన్ యాత్ర రెండో దశను ప్రారంభించిన నడ్డా.. రాష్ట్ర రాజకీయాలను టీఎంసీ నేరపూరితం చేసిందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేశారు.

"బంగాల్​కు ఉన్న గొప్ప సంస్కృతి, వారసత్వం మమతా బెనర్జీ పాలనలో ప్రమాదంలో పడింది. వీటిని భాజపా మాత్రమే కాపాడగలదు. బయటివారు, లోపలివారు అంటూ తృణమూల్ కాంగ్రెస్ ఒక్కొక్కరిపై ముద్రలు వేస్తోంది. ఇది సిగ్గుచేటు. లోపలి వ్యక్తులు-బయటి వ్యక్తులు అనే సంస్కృతి బంగాల్​ది కాదు. స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మించిన నేల సంస్కృతి కాదు."

-జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు

మా, మాటి, మనుష్(అమ్మ, నేల, ప్రజలు) అని నినాదమిచ్చే టీఎంసీ.. నియంతృత్వం, దోపిడీ, బుజ్జగింపు రాజకీయాల స్థాయికి దిగజారిపోయిందని ఆరోపించారు నడ్డా. బంగాల్​లో నిజమైన మార్పు భాజపానే తీసుకొస్తుందని చెప్పారు.

దీదీ కౌంటర్

కేంద్రంపై అదే స్థాయిలో విమర్శలు చేశారు టీఎంసీ అధినేత్రి, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల పేర్లను ఖరారు చేసి పంపినప్పటికీ.. పీఎం-కిసాన్ పథకం కింద రైతులకు నిధులు మంజూరు చేయలేదని ఆరోపించారు. నిధులను తానే అడ్డుకుంటున్నానని భాజపా చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. ఇప్పటికే రైతులకు రూ.5 వేల చొప్పున ఇస్తున్నామని, ఉచిత పంట బీమా కోసం కూడా ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రైతులకు మెరుగైన సదుపాయాలు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

తూర్పు బర్ధమాన్ జిల్లాలోని కల్నాలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించిన మమత.. దిల్లీ సరిహద్దులో నిరసన చేస్తున్న రైతులు తీవ్రమైన అకృత్యాలకు గురవుతున్నారని ఆరోపించారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు రైతులకు తమ మద్దతు కొనసాగుతుందన్నారు.

'భాజపా రాష్ట్రాల కంటే మెరుగే'

భాజపా పాలిత రాష్ట్రాలతో పోలిస్తే బంగాల్​లో శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయన్నారు దీదీ. భాజపాకు ఓటేసినందుకు త్రిపుర ప్రజలు చింతిస్తున్నారని చెప్పుకొచ్చారు. బయటి వ్యక్తులు రాష్ట్రంలోకి వచ్చి పేదల ఇళ్లలో తినడం.. కేవలం ఫొటో షూట్ కోసమేనని అన్నారు. బంగాల్​ను బంగాలీలే పాలిస్తారని, గుజరాత్​ నుంచి వచ్చేవారు కాదని చెప్పారు. నేతాజీ మిస్టరీపై కేంద్రం ఇప్పటివరకు చేసిందేమీ లేదని అన్నారు. తమ రాష్ట్రంలో మత విభజన ఉండదని, అన్ని వర్గాల ప్రజలు సామరస్యంతో జీవిస్తారని చెప్పారు.

'పార్టీ వీడేది అందుకే'

తప్పు చేస్తే తాను సహించనని, అందుకే కొంతమంది పార్టీని వీడుతున్నారని అన్నారు దీదీ. వారికి టీఎంసీ టికెట్ లభించదని ముందే తెలుసని చెప్పారు. వారు లేకుంటేనే పార్టీ మెరుగ్గా ఉంటుందని అన్నారు. భాజపా ఇచ్చే డబ్బు తీసుకోవాలని, అయితే ఓటు మాత్రం తనకే వేయాలని ప్రజలకు సూచించారు.

కాగా, కొన్ని రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన ఐపీఎస్ అధికారి హుమాయున్​ కబీర్... దీదీ సమక్షంలో టీఎంసీ కండువా కప్పుకున్నారు.

294 స్థానాలున్న బంగాల్ అసెంబ్లీకి వచ్చే ఏప్రిల్-మే నెలలో ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి: 'హైదరాబాద్​' పరికరంతో ఆపరేషన్​ ఉత్తరాఖండ్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.