ETV Bharat / bharat

'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా? - west bengal elections news

"లోకల్​ వర్సెస్ నాన్​-లోకల్".... బంగాల్​ రాజకీయం ప్రస్తుతం ఇదే అంశం చుట్టూ తిరుగుతోంది. మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొనేందుకు బంగాలీ ఆత్మగౌరవాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది అధికార తృణమూల్ కాంగ్రెస్. ఇంతకీ ఈ వ్యూహం ఫలిస్తుందా? తిప్పికొట్టేందుకు భాజపా ఏం చేస్తోంది? 2021 శాసనసభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

Bengal sees rise of subnationalism
'బంగాలీ ఆత్మగౌరవం' దీదీని గెలిపించేనా?
author img

By

Published : Aug 18, 2020, 5:30 PM IST

  • దీదీ హవా కొనసాగుతుందా?
  • మోదీ మంత్రం అద్భుతం చేస్తుందా?
  • కోల్​కతా​ పీఠం ఎవరికి దక్కుతుంది?

బంగాల్​ శాసనసభ ఎన్నికలకు ఇంకా అనేక నెలలు సమయం ఉన్నా... ఇప్పటినుంచే చర్చనీయాంశమైన ప్రశ్నలివి. అందుకు తగినట్టే ఆ రాష్ట్ర రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. అధికారం నిలబెట్టుకునే లక్ష్యంతో తృణమూల్ కాంగ్రెస్ పదునైన వ్యూహాలు రచిస్తోంది. గత లోక్​సభ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు అందుకున్న భాజపా.. ఈసారి బంగాల్​లో పాగా వేయాలన్న పట్టుదలతో పనిచేస్తోంది.

ఇలాంటి సమయంలో బంగాలీవాదం తెరపైకి వచ్చింది. అంతేకాదు బంగాలీల ఆత్మగౌరవం, స్థానికులు​ వర్సెస్​ ఔట్​సైడర్స్​ పేరిట పెద్ద యుద్ధానికే తెరలేచింది. బంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగాలు, విద్యలో స్థానికులకు రిజర్వేషన్​ ఇవ్వాలన్న గళం పెరుగుతోంది. ఇదే అదునుగా అధికార టీఎంసీ లోకల్​ సెంటిమెంట్​ను ఎన్నికల అస్త్రంగా మలుచుకుంటుంటే... భాజపా ప్రతివ్యూహాలు రచిస్తోంది.

రూటు మార్చిన రాజకీయం

'లోకల్' మంత్రం బంగాల్​కు చాలా కొత్త. కానీ ఇప్పుడు ఒక్కసారిగా 'బంగాలీ ఆత్మగౌరవం' తెరపైకి రావడానికి ప్రధాన కారణం భాజపా.

2019 లోక్​సభ ఎన్నికల్లో బంగాల్​లో ప్రభంజనం సృష్టించింది భాజపా. ఆ రాష్ట్రంలోని మొత్తం 42 స్థానాల్లో ఏకంగా 18 సీట్లు కైవసం చేసుకుంది. టీఎంసీని 22 సీట్లకే పరిమితం చేసి, ఊహించని దెబ్బ కొట్టింది. మిగిలిన 2 స్థానాలు కాంగ్రెస్​కు దక్కాయి.

2014 సార్వత్రిక ఎన్నికల్లో బంగాల్​లో భాజపా గెలిచింది 2 సీట్లే. అలాంటి పార్టీ 2019లో అనూహ్యంగా పుంజుకున్నాక... రాష్ట్ర రాజకీయం రూపు మారింది. హిందుత్వ శక్తుల దూకుడు పెరిగింది. ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే బంగాల్​లో పెద్దగా ప్రాచుర్యం లేని శ్రీరామ నవమి వంటి పండుగలకు భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించే సంస్కృతి మొదలైంది. ఆ ర్యాలీల సందర్భంగా వేర్వేరు వర్గాల మధ్య ఘర్షణలు జరగడం... రాజకీయ వేడిని మరింత పెంచింది.

ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లా పొఖ్ఖో, జాతియో బంగ్లా సమ్మేళన్, బంగ్లా సంస్కృతి మంచా వంటి బంగాలీ సంఘాలు రంగంలోకి దిగాయి. ఉత్తరాది సంస్కృతిని, హిందీని బంగాల్​పై బలవంతంగా రుద్దుతున్నారని అభ్యంతరం చెప్పడం ప్రారంభించాయి.

"శ్రీరామ నవమి సంబరాల నిర్వహణతోనే ఇబ్బందులు మొదలయ్యాయి. బంగాలీయేతరులు బంగాలీలను బెదిరిస్తున్న తీరు చూస్తుంటే... జనాభాపరంగా మాత్రమే కాక సాంస్కృతికంగానూ మేము మైనారిటీలుగా మారే రోజులు ఎంతో దూరంలో లేవని అనిపిస్తోంది."

-కౌశిక్ మైతీ, బంగ్లా పొఖ్ఖో సీనియర్ నేత

ఇదే సమయంలో టీఎంసీతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు కౌశిక్. స్థానికులకు ఉద్యోగాలు, విద్యలో రిజర్వేషన్లు కల్పించాలని ఎప్పటినుంచో తమ సంస్థ ఉద్యమిస్తోందని చెప్పుకొచ్చారు.

"బంగాలీ ఆత్మగౌరవం గురించి మేము ఎందుకు మాట్లాడకూడదు? గుజరాతీలు వాళ్ల నేపథ్యం గురించి ఘనంగా చెప్పుకుంటారు. తమిళులూ అంతే. మరి మేము అలా ఎందుకు చేయకూడదు? స్థానికత ఆధారంగా చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్ ఉంది. బంగాల్​కు ఎందుకు ఉండకూడదు?"

-అనిర్బన్ బెనర్జీ, జాతియో బంగ్లా సమ్మేళన్ ప్రతినిధి

బంగాలీల ఆర్థిక, సామాజిక హక్కుల పరిరక్షణే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని చెప్పారు బెనర్జీ.

ఆ వివాదాలతో తెరపైకి...

బంగాలీ సంస్థలు రాజకీయంగా ఇంత కీలకం కావడం 2017లోనే మొదలైంది. అప్పట్లో పోలీస్ కానిస్టేబుళ్ల నియామక పరీక్షలకు హిందీ, ఉర్దూను మాధ్యమంగా చేర్చాలన్న ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించాయి. చివరకు అలా జరగకుండా అడ్డుకున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారం తుది దశ ప్రచారంలో భాజపా ర్యాలీ సందర్భంగా సామాజికవేత్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహం ధ్వంసం, అసోం ఎన్​ఆర్​సీలో బంగాలీలు సహా మొత్తం 12 లక్షల మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయన్న వాదనలు... బంగాలీ సంస్థలు దూకుడు పెంచేందుకు కారణమయ్యాయి.

ఇప్పుడు రియా, విద్య

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్​పుత్​ ప్రియురాలు రియా చక్రవర్తి వ్యవహారమూ ఇప్పుడు బంగాలీవాదం బలపడేందుకు కారణమవుతోంది. సుశాంత్​ ఆత్మహత్యకు, రియాకు ముడి పెడుతూ... బంగాలీ మహిళల్ని చెడ్డవారిగా చూపే ప్రయత్నం జరుగుతోందని అక్కడి సంస్థలు మండిపడుతున్నాయి.

కేంద్రం ఇటీవల తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానమూ బంగాలీల అసంతృప్తికి కారణమైంది.

"పురుషుల్ని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు క్షుద్రపూజలు చేసే మంత్రగత్తెలని బంగాలీ మహిళల్ని ట్రోల్ చేస్తున్నారు, దూషిస్తున్నారు ఎందుకు? ప్రపంచంలో అత్యధిక జనాభా మాట్లాడే భాషాల్లో 5వది అయిన బంగాలీని జాతీయ విద్యా విధానంలోని క్లాసికల్ లాంగ్వేజెస్ జాబితాలో ఎందుకు చేర్చలేదు?"

లోకల్​ X ఔట్​సైడర్​

బంగాలీ ఆత్మగౌరవాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకునేందుకు టీఎంసీ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయంలో స్వయంగా ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. "భాజపా బయటి వ్యక్తుల పార్టీ. బంగాల్​ అధికార పగ్గాల్ని గుజరాతీలకు(మోదీ, షాను ఉద్దేశించి), బయటి వ్యక్తులకు అప్పగిస్తారా?" అని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశ్నిస్తున్నారు.

"బంగాల్​లో కాషాయ దళం పుంజుకోవడం వల్ల బంగాలీల్లో భయం మొదలైంది. ఎన్​ఆర్​సీ అమలు, హిందీని బలవంతంగా రుద్దడం వంటివి ఇందుకు కారణం. మేము భాజపాలా కాదు. మేము లౌకికవాదం, సమ్మిళిత అభివృద్ధినే నమ్ముతాం" అని చెప్పారు టీఎంసీ అధికార ప్రతినిధి సౌగతో రాయ్.

ఓటమి భయంతోనే టీఎంసీ నేతలు ఇలా మాట్లాడుతున్నారన్నది భాజపా విమర్శ. బంగ్లా పొఖ్ఖో వంటి సంస్థల్ని అడ్డంపెట్టుకుని మమత ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నది ఆ పార్టీ నేతల ఆరోపణ.

అలా అని బంగాలీవాదాన్ని ఏమాత్రం విస్మరించడం లేదు కమలదళం. జన్​సంఘ్​ వ్యవస్థాపకుడు, బంగాలీ అయిన శ్యామప్రసాద్​ ముఖర్జీ పేరును పదేపదే ప్రస్తావిస్తోంది. రవీంద్రనాథ్​ ఠాగూర్, బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ వంటి బంగాలీ దిగ్గజాల జయంతులు, వర్ధంతుల్ని ఘనంగా నిర్వహిస్తోంది.

బంగాలీవాదం.. రెండు వైపులా పదును

భాజపాను ఎదుర్కొనేందుకు బంగాలీవాదం ప్రస్తుతానికి అక్కరకు వస్తున్నా... కడవరకు ఆ అస్త్రాన్ని నమ్ముకోలేమన్నది కొందరు టీఎంసీ నేతల అభిప్రాయం. అదే అంశాన్ని పట్టుకుని వేలాడితే నష్టం జరిగే ప్రమాదమూ ఉందన్నది వారి ఆందోళన.

"బంగాలీ ఆత్మగౌరవం వల్ల ఇప్పటివరకు మాకు లాభమే జరిగింది. ముఖ్యంగా ఎన్​ఆర్​సీ తర్వాత లోక్​సభ ఎన్నికల తుది దశలో మొత్తం 9 సీట్లనే మేము దక్కించుకున్నాం. భాజపాకు చెందిన హిందూ ఓటుబ్యాంకును చీల్చగలిగాం. కానీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మాకు బంగాలీయేతరుల నుంచి మంచి మద్దతు ఉంది. కాబట్టి బంగాలీవాదాన్ని మేము బాహాటంగా, పూర్తిగా సమర్థించడం అంత సులువు కాదు." అని వివరించారు పేరు చెప్పేందుకు ఇష్టపడని టీఎంసీ నేత ఒకరు.

రెండు ప్రధాన ప్రత్యర్థి పార్టీలు ఇలా బంగాలీవాదం చుట్టూ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తుంటే... కాంగ్రెస్​ వాదన మరోలా ఉంది.

"ఈ రెండు పార్టీలు మతం, జాతి ఆధారంగా ప్రజల్లో చీలిక తెస్తున్నాయి. సౌభ్రాత్రం, సామరస్యం విషయంలో సుదీర్ఘ చరిత్ర ఉన్న బంగాల్ ప్రయోజనాలకు ఈ విధానాలు విఘాతం కలిగిస్తాయి. హిందీ-హిందూ-హిందుస్థాన్ విధానానికి భాజపా ముగింపు పలకకపోతే బంగాల్​లో ఎదురుదెబ్బ తప్పదు."

-అధిర్ రంజన్ చౌదరి, కాంగ్రెస్​ సీనియర్ నేత

ఇలా రసవత్తరంగా సాగుతున్న బంగాల్ రాజకీయం 2021లో జరిగే శాసనసభ ఎన్నికల నాటికి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.