ETV Bharat / bharat

బంగాల్​ హైడ్రామా: కేంద్ర బృందాల పర్యటనకు దీదీ బ్రేకులు! - కరోనాపై బంగాల్​లో దుమారం

బంగాల్​లో కేంద్ర బృందాల పర్యటన మరోసారి రాజకీయ హైడ్రామాకు దారి తీసింది. రాష్ట్రంలో పర్యటిస్తున్న తమ అధికారులను అడ్డుకుంటున్నారని కేంద్ర హోంశాఖ.. బంగాల్ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. అయితే మిగిలిన వైరస్ ప్రభావిత రాష్ట్రాలకు బృందాలను ఎందుకు పంపలేదని తృణమూల్, కాంగ్రెస్ నేతలు కేంద్రంపై ప్రశ్నాస్త్రాలు సంధించారు.

bengal
బంగాల్​లో హైడ్రామా
author img

By

Published : Apr 21, 2020, 6:51 PM IST

బంగాల్​లో కేంద్ర బృందం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య హైడ్రామా కొనసాగుతోంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు రెండు కేంద్ర బృందాలు సోమవారం బంగాల్​కు వెళ్లాయి. అయితే మమత బెనర్జీ సర్కారు ఈ బృందాలను అడ్డుకుంది.

అయితే రాష్ట్రంలోనే ఉండిపోయిన కేంద్ర బృందాలు నేడు తమ పర్యటనను కొనసాగిస్తూ వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధికార యంత్రాంగం వారిని అనుసరించడం నాటకీయ పరిణామాలకు దారి తీసింది.

సహకారం లేదు: కేంద్రం

తాము పర్యటించే అంశాన్ని మమత బెనర్జీ సర్కారు గోప్యంగా ఉంచుతోందని కేంద్ర బృందాలు అన్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసేందుకు తమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని వెల్లడించాయి. తమకు ఉన్న మార్గదర్శకాల్లో రాష్ట్ర సర్కారు సహకారం అందిస్తుందని పేర్కొన్నారని.. పలు దఫాలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శితో సంభాషించినట్లు పేర్కొన్నాయి.

సీఎస్​కు హోంశాఖ లేఖ

బంగాల్ పరిస్థితుల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది కేంద్ర హోంశాఖ. కేంద్ర బృందాలకు బంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని పేర్కొంది. ఆరోగ్యశాఖ సిబ్బందితో సంభాషించకుండా తమ అధికారులను అడ్డుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. తమకు రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయని అందులో ఉటంకించింది.

'వారిది సాహస యాత్ర'

బంగాల్​లో కేంద్ర అధికారుల పర్యటనపై స్పందించింది తృణమూల్ కాంగ్రెస్. కేంద్ర బృందాలది సాహస యాత్రని వ్యాఖ్యానించింది. ఈ మేరకు తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి చేరుకున్న మూడు గంటల అనంతరం పర్యటన చేపట్టాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వారిని కోరారన్నారు. కానీ అధికార బృందాలు అందుకు అంగీకరించలేదని.. తక్షణ పర్యటనకు పట్టుపట్టినట్లు స్పష్టం చేశారు. ఎక్కువ సంఖ్యలో కేసులు, ప్రభావిత ప్రాంతాలు ఉన్న రాష్ట్రాలకు కేంద్రం అధికార బృందాలను ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు.

'ప్రాతిపదిక ఏమిటి.?'

బంగాల్​కు కేంద్ర బృందాలను పంపించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది కాంగ్రెస్. అధికార బృందాలను పంపించేందుకు ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించారు సీనియర్ నేత అహ్మద్ పటేల్. హోంమంత్రి అమిత్​షా.. గుజరాత్​కు కేంద్ర బృందాన్ని పంపాలని సవాల్ విసిరారు.

ఇదీ చూడండి: విస్తృత పరీక్షలే కరోనా కట్టడికి శరణ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.