ETV Bharat / bharat

ఇవి దగ్గరుంటే సూర్యుడు మీ అందాన్ని ఏమీ చేయలేడు! - sun lotion

వేసవి ప్రారంభం నుంచే భానుడి భగభగలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇంతటి ఎండలో తిరగాలంటే అమ్మాయిలు భయపడతారు. అయితే కొన్ని వస్తువులు మీ దగ్గరుంటే భానుడు మీ అందాన్ని ఏమీ చేయలేడు. అవేంటో తెలుసుకోండి..

beat the heat with these handbag essentials
ఇవి మీ దగ్గరుంటే సూర్యుడు మీ అందాన్ని ఏమీ చేయలేడు!
author img

By

Published : Mar 19, 2020, 2:00 PM IST

అందానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే మహిళలు వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ నుంచి చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. వేసవిలో ఫ్యాషన్​ దుస్తులు ధరిస్తే.. సూర్యకిరణాలు చర్మాన్ని తాకే అవకాశమున్నందున.. అమ్మాయిలు ఈ తరహా దుస్తులు వేసుకునేందుకు కాస్త ఆలోచిస్తారు. పొడవాటి దుస్తులు ధరించేందుకు ప్రాధాన్యమిస్తారు. ఈ జాగ్రత్తలతోపాటు మీ హ్యాండ్​బ్యాగ్​లో నిత్యం కొన్ని వస్తువులు ఉంటే.. భానుడి భగభగలు మీ సౌందర్యాన్ని ఏమీ చేయలేవు.

సన్ ​స్క్రీన్ లోషన్​​

వేసవిలో భానుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు చర్మానికి హాని చేస్తాయి. నిగారింపును తగ్గిస్తాయి. అయితే సన్ ​స్క్రీన్ లోషన్​ రాసుకోవడం వల్ల ఈ సమస్యను అధిగమించొచ్చు. అందుకు నిత్యం సన్​స్క్రీన్​ లోషన్​ను హ్యాండ్​బ్యాగ్​లో తప్పనిసరిగా ఉంచుకోవాలి. ప్రొటెక్షన్ ఫ్యాక్టర్​(ఎస్​పీఎఫ్​) 15, అంతకంటే ఎక్కువ ఉండే సన్​స్క్రీన్​ను ఎంచుకోవాలి.

వెట్​ వైప్స్​

సాధారణంగా వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. దీనివల్ల చర్మంపై అధికంగా దుమ్ము, ధూళి చేరుతుంది. వెట్​ వైప్స్​ వాడడం వల్ల చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి తుడిచివేయొచ్చు. ముఖం, శరీరం తాజాగా కనిపించేందుకు ఇది ఎంతో సహకరిస్తుంది.

లిప్​బామ్​

వేసవిలో చర్మం పొడిబారుతుంది. అందుకే మాయిశ్చరైజర్​ తప్పనిసరిగా వాడాలి. ముఖ్యంగా పెదవులు పొడిబారి పగిలిపోతాయి. అందుకు హైడ్రేటెడ్​, రక్షణనిచ్చే మాయిశ్చరైజింగ్ ​​లిప్​బామ్​లను వాడాలి. ఇవి కూడా ఏవి పడితే అవి వాడేయకుండా మంచి వాటినే వాడాలి.

రోజ్​వాటర్​

వేసవిలో పొడిబారిన చర్మానికి రోజ్​వాటర్​ ఓ ఔషధంలా పనిచేస్తుంది. ముఖానికి, చర్మానికి ఈ రోజ్​వాటర్​ను పూతగా పూసుకోవడం వల్ల చర్మం తాజాగా మెరుస్తుంది.

శిరోజాలకూ..

వేసవిలో కేశ సంరక్షణ చాలా ముఖ్యం. ఎండకు శిరోజాలు దెబ్బతినకుండా కండీషనర్​ క్రీం రాసుకోవాలి. వీటిని జుట్టు చివర్లో రాసుకొని దువ్వుకోవడం ఉత్తమం. షాంపూలతో ఇష్టానుసారంగా శిరోజాలను రుద్ద కూడదు. ఇలా చేస్తే అవి పగిలిపోయే ప్రమాదముంది.

సన్​ గ్లాసెస్​

భానుడి నుంచి కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. ఎండలో కళ్లకు రక్షణ ఇచ్చేలా సన్​గ్లాసెస్​ను ధరించడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే సూర్యకిరణాలతో పాటు దుమ్ము, ధూళీ కళ్లను చేరదు.

దుర్వాసన లేకుండా

వేసవిలో చెమట చాలా ఎక్కువగా వస్తుంది. దీని వల్ల శరీరం నుంచి దుర్వాసన కూడా వస్తుంది. అందుకు జేబులో పట్టే ఓ రోల్​, దుర్గంధనాశనిని వాడడం వల్ల ఈ ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు.

పైన తెలిపిన వస్తువులు నిత్యం హ్యాండ్​బ్యాగ్​లో ఉంటే వేసవిలో చర్మ సంరక్షణలో విజయం మీదే. ఒకవేళ ఈ వస్తువులు వాడటం కుదరని సందర్భాల్లో తప్పనిసరిగా గొడుగు వాడాలి. ఇది పైన తెలిపిన వస్తువుల పనులన్నీ పూర్తి చేస్తుంది.

ఇదీ చదవండి: నిర్భయ దోషుల ఉరిశిక్ష కోసం పవన్​ ట్రయల్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.