మే 4 నుంచి 14 రోజుల పాటు అమలు కానున్న లాక్డౌన్ 3.0 నిబంధనలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరింత స్ఫష్టతనిచ్చింది. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసరేతర వస్తువులు విక్రయించేందుకు ఈ-కామర్స్ సంస్థలకు అనుమతిచ్చింది. అలాగే ఈ ప్రాంతాల్లో బార్బర్ షాపులు, సెలూన్లు తెరిచేందుకు ఆమోదం తెలిపింది.
మే 17 వరకు పొడిగించిన లాక్డౌన్లో పలు ఆంక్షలను సడలించినట్లు చెప్పారు కేంద్ర హోం శాఖ అధికార ప్రతినిధి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు సేవలను పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు.
లాక్డౌన్ను పొడిగిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్రం హోం శాఖ. నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.