ETV Bharat / bharat

తెల్లారితే పెళ్లి.. ఈ లోపు వరుడు మారిపోయాడు! - groom changed in eeta

రేపు పెళ్లి అనగా.. పెళ్లి కుమారుడు మారిపోయాడు. మారిపోయాడంటే.. దురలవాట్లు మానేసి మంచిగా మారాడనో, కొత్త అలవాట్లు చేసుకుని చెడుగా మారిపోయాడనో కాదు. ఏకంగా మనిషే మారిపోయాడు. తాము చూసిన అబ్బాయి స్థానంలో మరో యువకుడిని చూసి ఖంగు తిన్న వధువు కుటుంబ సభ్యులు ఏం చేశారంటే!

Barat held hostage in Uttar Pradesh as 'different' groom turns up
ముహుర్త సమయానికి పెళ్లికుమారుడు మారిపోయాడు!
author img

By

Published : Jul 3, 2020, 3:02 PM IST

అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తెల్లారితే ముహూర్తం. వరుడి కుటుంబాన్ని ఆనందంగా స్వాగతించారు. అందరూ ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నారు. అప్పుడే.. ఓ పిడుగు లాంటి నిజం బయటపడింది. పెళ్లికుమారుడు మారిపోయాడని తెలిసిపోయింది. ఇంకేముంది.. వరుడి కుటుంబాన్ని ఓ గదిలో వేసి బంధించేశారు పెళ్లి కుమార్తె బంధువులు.

ఉత్తర్​ప్రదేశ్​ ఈటా, ధంతిగార గ్రామానికి చెందిన సంజీవ్​ కుమార్​.. కొద్ది రోజుల క్రితం, మెయిన్​పురీకి చెందిన ఓ యువకుడితో కూతురి పెళ్లి ఖాయం చేశాడు. అనుకున్నట్టుగానే, పెళ్లి పనులన్నీ పూర్తి చేశారు. అయితే, విడిదింటికి విచ్చేసిన పెళ్లి కుమారుడిని చూసి ఖంగు తిన్నాడు సంజీవ్​. తాము సంబంధం మాట్లాడుకున్న అబ్బాయి స్థానంలో మరెవరో కనిపించారు.

దీంతో.. వరుడి కుటుంబ సభ్యులు పెళ్లికుమారుడిని మార్చేశారని గ్రహించి.. వచ్చినవారందరినీ.. గదిలో వేసి బంధించేశారు అమ్మాయి తరఫు బంధువులు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి కోసం తాము ఖర్చు చేసిన రూ. 12 లక్షలు వరుడి కుటుంబమే చెల్లించాలని డిమాండ్​ చేశారు. పోలీసులు వరుడి కుటుంబ సభ్యులను విడిపించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: గోరింటాకుతో అరచేతుల్లో ఆరోగ్యం పండుతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.