ETV Bharat / bharat

భారత్​- బంగ్లాదేశ్​ సరిహద్దులో స్మగ్లర్​ కాల్చివేత - smuggle Phensedyl bottles

బంగాల్​లోని భారత్​- బంగ్లాదేశ్​ సరిహద్దు ప్రాంతంలో ఓ విదేశీ స్మగ్లర్​ను హతమార్చాయి భద్రతా బలగాలు. నిషేధిత ఉత్ప్రేరకాలను అక్రమ రవాణా చేస్తున్న కారణంగా అతణ్ని కాల్చి చంపినట్లు తెలిపారు అధికారులు.

Bangaldeshi smuggler killed along India-Bangladesh border in WB: BSF
బంగాల్​ సరిహద్దులో బంగ్లాదేశ్​ స్మగ్లర్​ కాల్చివేత
author img

By

Published : Sep 6, 2020, 2:50 PM IST

సరిహద్దు ప్రాంతంలో బంగ్లాదేశ్​కు చెందిన ఓ స్మగ్లర్​ను సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్​ఎఫ్​) కాల్చి చంపాయి. మాల్దా జిల్లాలోని గోపాల్​పుర్​ వద్ద శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

ఫెన్సిడైల్​ మందును స్మగ్లర్​ అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిసింది. అతని వద్ద నుంచి 75 సీసాల దగ్గు మందును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అధికారులు.

ఫెన్సిడైల్​.. కోడైన్​ ఆధారిత దగ్గు మందు. లిక్కర్​ నిషేధాన్ని అమలు చేస్తోన్న బంగ్లాదేశ్​లో ఈ మందును యువత అధికంగా సేవిస్తున్నారు. తక్కువ మోతాదులో కాకుండా మత్తు కోసం ఎక్కువ డోసులు తీసుకుంటున్నారని బీఎస్​ఎఫ్​ తాజా నివేదికలో తేలింది.

ఇదీ చదవండి: బాలికపై పోలీసుల సామూహిక అత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.