గుజరాత్ బనాస్కాంఠా జిల్లా దంతివాడాలో దారుణం జరిగింది. పాలుపితికే యంత్రం వల్ల కరెంట్ షాక్ తగిలి 11 ఆవులు మరణించాయి. సోమవారం ఉదయం యంత్రంతో పాలు పితుకుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.
దీంతో ఆవులపైనే ఆధారపడి జీవిస్తున్న రైతు.. ఒక్కసారిగా దుఃఖ సాగరంలో మునిగిపోయాడు. పాల యంత్రం తయారు చేసిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేశాడు.
సమాచారం అందుకున్న బనాస్ డైయిరీ అధికారులు సహా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ చూడండి: చలిని లెక్కచేయకుండా.. సాగుతున్న రైతన్న పోరాటం