ETV Bharat / bharat

పిడుగులు పడినా.. ఆ శివలింగం చెక్కుచెదరదు! - హిమాచల్​ ప్రదేశ్​ శివలింగం

సాధారణంగా పిడుగు పడితే.. మహా వృక్షాలే మాడి మసైపోతాయి. కానీ కులూలోని ఆ ఆలయంలో శివలింగంపై 12 ఏళ్లకు ఓసారి పిడుగు పడి ముక్కలైపోతుంది. అయితే శివలింగం మాత్రం ఎప్పటిలాగే తిరిగి అతుక్కుంటుంది. ఆ అద్భుత ఆలయం విశేషాలు తెలుసుకుందాం..

Baijnath is a town in Kangra district of Himachal Pradesh here The ancient temple of Lord Shiva is very famous
పిడుగు పడి ముక్కలైనా.. తిరిగి అతుక్కునే 'శివలింగం' చూశారా..!
author img

By

Published : Feb 21, 2020, 8:11 AM IST

Updated : Mar 2, 2020, 12:58 AM IST

పిడుగు పడి ముక్కలైనా.. తిరిగి అతుక్కునే 'శివలింగం'

హిమాచల్​ప్రదేశ్​ కులూ నగరానికి 7 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న బిజిలీ మహాదేవ్​(పిడుగుపాటు శివుడు).. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భక్తులను కాపాడేందుకు తన తలపైనే పిడుగు పడేలా చేసుకుంటాడని నమ్ముతారు. అందుకే, ఆ త్రినేత్రుడి దర్శనభాగ్యం పొందేందుకు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఈ శైవక్షేత్రానికి చేరుకుంటున్నారు భక్తులు.

Baijnath is a town in Kangra district of Himachal Pradesh here The ancient temple of Lord Shiva is very famous
త్రినేత్రుని త్రిశూలం

ముక్కలై అతుక్కుంటుంది..

ఈ బిజిలీ మహదేవ్​ ఆలయంలో 12 ఏళ్లకు ఓసారి మహా అద్భుతం సాక్షాత్కరిస్తుంది. దేవేంద్రుడు ఆదేశించిన ఆ పిడుగు పెళపెళ ధ్వనితో.. ఆకాశమంత ప్రకాశంతో.. శరవేగంగా శివలింగాన్ని ఢీకొడుతుంది. పిడుగుపాటుకు శివలింగం తునాతునకలైపోతుంది. కానీ, ఆలయ పూజారి విరిగిన శివలింగ ముక్కలను తిరిగి పేర్చి మహేశ్వరుడికి వెన్నతో రాస్తాడు. అంతే, మరో మరమ్మతు అవసరం లేకుండా ఆ వైద్యానాథేశ్వరుడికి తగిలిన పిడుగు దెబ్బలన్నీ మాయమైపోతాయి.. క్రమంగా శివలింగం అతుక్కుని పూర్వ రూపాన్ని దాల్చుతుంది.. ఇక్కడ ఇలా పిడుగులు పడడం సాధారణం.. శివలింగం తిరిగి అతుక్కోవడమూ సర్వసాధారణం.

Baijnath is a town in Kangra district of Himachal Pradesh here The ancient temple of Lord Shiva is very famous
పిడుగు పడి ముక్కలైనా.. తిరిగి అతుక్కునే 'శివలింగం' చూశారా..!

"మేము ఏటా బిజిలీ మహదేవ్ దర్శనానికి వస్తాం. దాదాపు 40 ఏళ్లుగా ఇక్కడికి వస్తున్నాం. ఇతిహాసాల్లో ఏముందంటే ఈ ఆలయంలో శివ లింగంపై పిడుగు పడుతుంది. అది చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు. ఇక్కడ కోరిన కోర్కెలు తీరుతాయి కాబట్టే మళ్లీ మళ్లీ దర్శనానికి వస్తారు భక్తులు."

-సుమిత్​ నాగ్​, భక్తుడు

పూర్వం ఈ ఖారాహల్ లోయ ప్రాంతంలో రాక్షస వధ జరిగిందని.. అప్పుడే ఇక్కడ శివలింగం వెలసిందని ఇక్కడి వారి నమ్మకం. కులూ లోయ శివుడు వధించిన ఒక పెద్ద పాము ఆకారంలో కనిపిస్తుందంటారు స్థానికులు. ఆ భోలానాథుడి కృప ఇక్కడి ప్రజలపై ఉందని నమ్ముతారు. పిడుగులు భక్తులపై విరుచుకుపడకుండా కాపాడేందుకు.. తనపైనే పిడుగు పడేలా ఆ శివుడే ఇంద్రుడిని కోరాడని.. అందుకే పుష్కరానికి ఒకసారి ఇలా జరుగుతుందని చెబుతుంటారు.

ఆ శివుడే నడిపిస్తాడు..

మహాదేవుడే నడిపిస్తాడు..

పిడుగు పాట్ల నుంచి ప్రజలను కాపాడుకుంటున్న ఆ బిజిలీ మహాదేవ్​ ఆలయాన్ని దర్శించుకునేందుకు ఏటా దేశ విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఎముకలు కొరికే చలిలో.. మోకాళ్ల ఎత్తుదాకా పేరుకుపోయిన మంచులో.. నిర్భయంగా నడిచివెళ్తారు. ఈ ప్రయాణంలో అసలు వారికి అలసట, చలి వంటి ఇబ్బందులేమీ ఉండవనీ, హరహరుడు నిరంతరం భక్తుల్లో ధైర్యాన్ని నింపుతాడని అక్కడివారు పేర్కొంటున్నారు.

శివదర్శనం కోసం ఇలా..

శివ మార్గం ఎంత సులభం

ఇదీ చదవండి: ఆగ్రా కోసమే ట్రంప్​ 'సబర్మతి' సందర్శన రద్దు!

Last Updated : Mar 2, 2020, 12:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.