ETV Bharat / bharat

అసభ్య వ్యాఖ్యలపై లోక్​సభలో ఆజంఖాన్​ క్షమాపణ - Azam

లోక్​సభలో అసభ్య వ్యాఖ్యలు చేయడంపై ఎంపీ ఆజంఖాన్ క్షమాపణలు చెప్పారు. జులై 25న భాజపా ఎంపీ రమాదేవిని ఉద్దేశించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీలకు అతీతంగా వచ్చిన డిమాండ్ల మేరకు ఆయన క్షమాపణలు చెప్పక తప్పలేదు.

అసభ్య వ్యాఖ్యలపై లోక్​సభలో ఆజంఖాన్​ క్షమాపణ
author img

By

Published : Jul 29, 2019, 11:53 AM IST

Updated : Jul 29, 2019, 12:25 PM IST

సమాజ్​వాదీ పార్టీ ఎంపీ ఆజంఖాన్​ లోక్​సభలో క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు సభ్యులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని సభలో ప్రకటన చేశారు. జులై 25న భాజపా ఎంపీ రమాదేవిని ఉద్దేశించి ఆజం అసభ్య పదజాలం ఉపయోగించారు. పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఆజం క్షమాపణలు తెలపాలని తీర్మానించారు. అన్ని పార్టీల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని వెల్లడించిన స్పీకర్ ఓం బిర్లా ఆ మేరకు ఆజంతో సభలో క్షమాపణలు చెప్పించారు.

ఆజం ప్రకటనలో కొన్ని పదాలు వినిపించలేదని, మరోసారి తెలపాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పీకర్ ద్వారా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి తన క్షమాపణను చదివి వినిపించారు ఆజం.

అసభ్య వ్యాఖ్యలపై లోక్​సభలో ఆజంఖాన్​ క్షమాపణ

"నా మాటలు సభకు, స్పీకర్​కు వ్యతిరేకంగా ఉండవు. రెండు సార్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేశాను. నాలుగు సార్లు మంత్రిగా ఉన్నాను. తొమ్మిదిసార్లు ఎంపీగా పనిచేశాను. నా భాష, వ్యవహారశైలి సభకు మొత్తం తెలుసు. ఇదంతా తెలిసి కూడా నా మాటలు తప్పని భావిస్తే నా క్షమాపణలు తెలుపుతున్నా. గౌరవ సభ్యురాలు నా సోదర సమానురాలని నేను ముందే చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా ఒకటే..ఎవరికైనా నా మాటల పట్ల అభ్యంతరముంటే క్షమాపణలు."

-ఆజం ఖాన్, సమాజ్​వాదీ ఎంపీ

ఆజం వ్యాఖ్యలతో మహిళలు, పురుషులు అనే భేదం లేకుండా దేశ ప్రజలందరూ బాధపడ్డారని ఎంపీ రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు.

సభలో ఉపయోగించే భాష విషయమై సభ్యులు సమన్వయం పాటించాలని స్పీకర్ ఓంబిర్లా స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఆజంఖాన్​పై ఎంపీల ధ్వజం- క్షమాపణకు డిమాండ్

Patna (Bihar), July 18 (ANI): Police used water cannon and tear gas to disperse protesting contractual teachers who were demanding pay on par with regular teachers. The teachers were protesting near Vidhan Sabha in Patna.

Last Updated : Jul 29, 2019, 12:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.