జమ్ముకశ్మీర్‌లో ఆజాద్‌కు చేదు అనుభవం ఎన్నికల ప్రచారం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మూడు రోజుల జమ్ముకశ్మీర్ పర్యటనలో ఉన్నారు. పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో ప్రచారానికి ఆటంకం ఎదురైంది. రాజౌరి జిల్లాలోని లామ్ గ్రామంలో స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి తరఫున ఆజాద్ నేరుగా ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే, సరిహద్దులో పాక్ దాడుల నేపథ్యంలో అధికారులు ఆయన హెలికాఫ్టర్ లామ్‌లో దిగేందుకు అనుమతించలేదు.
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఆజాద్ ప్రసంగం వినటానికి 3000 మందికి పైగా ప్రజలు సమావేశానికి హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆజాద్ కోసం ఎదురు చూశారు. అయినా ఆయన రాకపోగా... స్థానిక కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల నేతలు సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించారు.
చివరకు ఆజాద్ ఫోన్ ద్వారా ప్రసంగించారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థిని ఎన్నికల్లో గెలిపించాలని ఓటర్లను కోరారు.