ETV Bharat / bharat

సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?

కరోనా వైరస్​... ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. దీనిని అరికట్టేందుకు ప్రస్తుతం వైద్యపరంగా ఎలాంటి ప్రత్యేక చికిత్సలు లేవు. అయితే.. మానవ శరీరంలో రోగ నిరోధక శక్తి పొరలెన్నో ఉంటాయి. మనలో వ్యాధులు విజృంభించకుండా అడ్డుకుంటాయి. అందుకే.. రోగనిరోధక శక్తిని పెంచుకుని వైరస్​ వ్యాప్తిని అడ్డుకోవచ్చు. దానికోసం ఆయుర్వేదం మేలంటున్నారు ప్రముఖ వైద్యులు.

ayurveda-coronavirus-can-be-curbed
సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?
author img

By

Published : Mar 25, 2020, 5:47 PM IST

Updated : Feb 17, 2021, 5:23 PM IST

కరోనా వైరస్‌... గుండెల్లో దడ పుట్టిస్తున్న పేరు ఇది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక వైరస్‌ కొద్ది రోజుల వ్యవధిలోనే పలు దేశాలకు వ్యాపించింది. చైనాలో గతేడాది ఆఖర్లో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్​.. 2020 జనవరిలో భారత్​కు విస్తరించింది. కేరళలో 3 కేసులు నమోదయ్యాయి. అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. ట్రావెల్​ అడ్వైజరీ జారీ చేసింది. చైనాకు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు తప్పనిసరి చేసింది.

ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రతను అంచనా వేయలేకపోతున్న ప్రపంచ వైద్యులు.. వైరస్​ నమూనాలను సేకరించే పనిలో పడ్డారు. వాటితో వ్యాక్సిన్లు, మందులు కనుగొనడంలో నిమగ్నమయ్యారు. వైరస్​ పుట్టుక, సంక్రమణ ఇలా ఎన్నెన్నో అంతుచిక్కని సందేహాలకు సమాధానాలు వెతికేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైరస్​కు చికిత్స లేకున్నా.. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. చికిత్స కంటే నివారణ ఉత్తమం అన్న నానుడి అలవర్చుకోవాలి. మనం సురక్షితంగా ఉండేందుకు.. తాత్కాలిక పరిష్కారం కావాలి కదా.

కరోనా వైరస్​ అంటే...?

మానవ శరీరంలో ఎన్నో వైరస్​లకు కేంద్రం శ్వాసకోశ వ్యవస్థ. జలుబు, దగ్గు, ఇతర ఎన్నో జబ్బులను సృష్టిస్తాయి ఈ వైరస్​లు. కరోనా వైరస్​ కొత్త వర్గానికి చెందినది. ఇది జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుంది.

వ్యాప్తి...

2002-03లో చైనాను వణికించిన సార్స్​(సివియర్​ అక్యూట్​ రెస్పిరేటరీ సిండ్రోమ్​), దశాబ్దం తర్వాత.. పశ్చిమాసియా దేశాల్లో కల్లోలం సృష్టించిన మెర్స్​(మిడిల్​ ఈస్ట్​ రెస్పిరేటరీ సిండ్రోమ్​) కరోనా వైరస్ సూక్ష్మజీవి లాంటివే. ఈ రెండు మహమ్మారిలు అప్పట్లో వందలాది ప్రజల ప్రాణాలు తీశాయి.

అయితే.. ఈసారి పుట్టుకొచ్చిన వైరస్​ చైనాలోని వుహాన్​ కేంద్రంగా మొదలైంది. ఇక్కడే... సముద్రపు ఆహారాన్ని విక్రయించే ఓ మార్కెట్​ నుంచి వైరస్​ వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు..

  • జ్వరం
  • దగ్గు
  • శ్వాస తీసుకోవడంలో సమస్య
  • విపరీతమైన చలి
  • ఆయాసం
  • ఛాతి, తల నొప్పి, గొంతులో మంట
  • విరేచనాలు, వాంతులు

కరోనా వైరస్​ ఎంతో ప్రమాదకరమైనది. ఈ రకం వైరస్‌ ఒకసారి సోకితే సంఖ్యను పెంచుకుంటూ, వేగంగా ఊపిరితిత్తుల్లోకి చేరుకుని న్యుమోనియాను కలిగిస్తాయి. శరీరంలోని ప్రధాన అవయవాల్ని దెబ్బతీస్తాయి.

ఎలా నియంత్రించాలి....?

రోగ నిరోధకశక్తి బలంగా ఉన్నంత కాలం వ్యాధికారక సూక్ష్మక్రిములు సోకినా, విజృంభించేలోపే చనిపోతూ ఉంటాయి. చెడు ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, పరిశుభ్రత లోపించడం ఇతరత్రా కారణాలతో అవి బలహీనమవుతాయి. అందుకోసం.. కరోనా నుంచి రక్షణ పొందడం కోసం వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి.

మనల్ని మనం కాపాడుకోవడం కోసం కొన్ని ముందు జాగ్రత్తలు ఇవిగో..

  • చేతుల్ని ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
  • సరిగా ఉడకని మాంసాన్ని తినకండి
  • అపరిశుభ్రమైన ప్రదేశాల్లో తయారైన ఆహారానికి దూరంగా ఉండాలి.
  • పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడగాలి.
  • ఇతరులతో సన్నిహిత సంబంధాలు తగ్గించుకోవాలి. కరచాలనానికీ దూరంగా ఉండడం మంచిది.
  • వైరస్​ ముక్కు ద్వారా వ్యాపించకుండా.. ఎన్​95 లాంటి మాస్కులు ధరించాలి.
  • వైరస్​ కళ్ల ద్వారా శరీరానికి వ్యాపించే అవకాశాలున్నాయి. అందుకోసం గాగుల్స్ పెట్టుకోవాలి.
  • నీరు ఎక్కువగా తాగడం మంచిది.

ప్రమాదం వీరికే ఎక్కువ...

  • మధుమేహం​, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత రోగాలు ఉన్నవారు.
  • వృద్ధులు
  • పిల్లలు
  • అవయవమార్పిడి చేసుకున్నవారు
  • చికిత్స తీసుకుంటున్న కేన్సర్​ వ్యాధిగ్రస్తులు

నివారణ కోసం చేయాల్సినవి....

సంప్రదాయ పురాతనమైన భారతీయ వైద్యం ఆయుర్వేదం కూడా ఇలాంటి కరోనా వైరస్​ నుంచి కాపాడుకునేందుకు దోహదపడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి కొత్త వైరస్​ శరీరంలోకి వ్యాపించినా.. ఆయుర్వేదం మనలో రోగనిరోధక శక్తిని పెంచుతుందట. ఈ తరుణంలో.. శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేసే పలు ఆయుర్వేద విధానాలను అనుసరించాలని ప్రముఖులు సూచిస్తున్నారు.

పలువురు ప్రముఖ ఆయుర్వేద వైద్యులు సూచించిన విధానాల్లో ఏదైనా ఒకటి వాడమని చెబుతున్నారు. ఇది కరోనా వ్యాప్తిని నివారిస్తుందని అంటున్నారు. ఇవన్నీ 10-15 రోజుల పాటు వాడాలి. 12 ఏళ్ల లోపు పిల్లలకు సగం మోతాదులో ఇస్తే సరిపోతుంది.

1. షడంగ పానీయం

రోజూ ఉదయం అల్పాహారానికి ముందు 15 మిల్లీలీటర్ల చొప్పున తీసుకోవాలి.

2. అగస్త్య హరీతకి రసాయనం

రోజూ ఆహారం తీసుకునేముందు.. 5 గ్రాముల చొప్పున వాడాలి. రోజూ రెండు సార్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.

(లేదా)

3. హరిద్రాఖండ్​

5 గ్రా చొప్పున ప్రతి రోజూ రెండు సార్లు తీసుకోవాలి.

కఫకేతు రసం

200 గ్రాముల చొప్పున రోజూ ఒకసారి తీసుకోవాలి.

ఈ చూర్ణాన్ని(పొడి) వెచ్చని నీటిలో లేదా తేనెలో కలుపుకొని తాగవచ్చు.

(లేదా)

4. త్రికటు చూర్ణం(25గ్రా)+ గుడూచి సత్వం(5గ్రా)+ యష్టిమధు చూర్ణం(25గ్రా)

ఇవన్నీ బాగా కలిపి.. అల్పాహారానికి ముందు 2 నుంచి 3 గ్రాముల చొప్పున తీసుకోండి.

కరోనా వైరస్​ మహమ్మారిని ప్రపంచమంతా ఒక్కటై ఎదుర్కోవాలని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఎవరైనా కరోనా సంబంధిత లక్షణాలుంటే.. వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని చెబుతున్నారు.

చివరగా.. వైరస్​ను మన దరిచేరనీయకుండా ఉండేందుకు పరిశుభ్రమైన పరిసరాల్లో ఉండటం, వెచ్చని నీరు తాగడం, తాజాగా వండిన ఆహారాన్ని తినడం మేలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

- డా. వి. రంగనాయకులు(మెడికల్​ ఫిజియాలజీ రిటైర్డ్​ హెచ్​ఓడీ, ఎస్​వీ ఆయుర్వేద కళాశాల, తిరుపతి)

Last Updated : Feb 17, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.