పవిత్ర మక్కా మసీదులోని కాబా స్తూపం తరహాలో అయోధ్యలో మసీదు నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సంప్రదాయ మసీదులకు భిన్నంగా కాబా స్తూపం చదరపు ఆకారంలో ఉంటుంది. అయోధ్యలో మసీదు ఆకృతి విషయంలోనూ దాన్ని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ఈ మసీదుకు బాబ్రీ పేరును కానీ, ఇతర ఏ చక్రవర్తి పేరును కానీ పెట్టే ఉద్దేశం లేదని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(ఐఐసీఎఫ్) కార్యదర్శి అథర్ హుస్సేన్ పేర్కొన్నారు.
"ధన్నిపుర్ గ్రామంలో 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మసీదును నిర్మిస్తాం. బాబ్రీ మసీదుతో సమానమైన విస్తీర్ణంలోనే ఇది ఉంటుంది. అయితే దీని ఆకృతి మాత్రం ఇతర సంప్రదాయ మసీదులకు భిన్నంగా ఉండొచ్చు. వాస్తు శిల్పి ఎస్.ఎం.అక్తర్ చెప్పిన దాని ప్రకారం అది కాబా స్తూపం ఆకారంలో, గోపురాలు లేదా మినార్లు లేకుండా ఉండొచ్చు."
- అథర్ హుస్సేన్
ఇదీ చూడండి: వాణిజ్య ప్రకటనల్లో చర్మ వర్ణంపై వివక్ష చూపొద్దు