దేశంలో పండుగలు అంటే కలిసికట్టుగా ఉండేందుకు, ఐక్యతకు నిదర్శనం. ఈ విషయాన్ని సరిగ్గా నిరూపించాడు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన జితేంద్ర ఖాథీక్ అనే ఓ ఆటో డ్రైవర్. రక్షాబంధన్ సందర్భంగా మహిళలను ఉచితంగా వారి గమ్య స్థానాలకు చేర్చి సోదర భావాన్ని చాటాడు. ఇలా చేయడం జితేంద్రకు ఇది కొత్తేమి కాదు గత ఆరేళ్లుగా ప్రతీ రక్షాబంధన్‌కు ఇలా ఉచితంగా సేవలందిస్తున్నాడితడు.
"రక్షాబంధన్ నాడు చాలా మంది ఆటో డ్రైవర్లు ఆటోలు నడపరు. ఈ సమయంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ కారణంగా చాలా మంది మహిళలు వారి సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్లలేక పోతారు. ఆలా జరగొద్దనే ఉద్దేశంతో నేను ఈ సేవ ప్రారంభించా." - జితేంద్ర ఖాథీక్, ఆటో డ్రైవర్
ఇదీ చూడండి: మోదీ 'సీడీఎస్' నిర్ణయంపై ప్రశంసల జల్లు