తమిళనాడు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయంలో 'అత్తివరధర్ వైభవం' తుది దశకు చేరుకుంది. 40 ఏళ్ల అనంతరం భక్తులకు దర్శనమిచ్చిన అత్తివరధర్ విగ్రహం... తిరిగి కోనేరుకు చేరుకోనుంది.
ఈ కార్యక్రమం కోసం ఆలయవర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దెబ్బతినకుండా ఉండటానికి ప్రత్యేక మూలికలతో విగ్రహాన్ని చుట్టనున్నారు. ఈ రాత్రి 10 నుంచి 12 గంటల మధ్యలో విగ్రహాన్ని కోనేరులో పెట్టి నీరు నింపుతారు.
ఇదీ ప్రత్యేకత...
వరదరాజ పెరుమాళ్ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అత్తివరధర్ స్వామి.. ఆలయంలోని అనంత సరోవరం కోనేరులో విశ్రాంతి తీసుకుంటూ.. 40 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనమిస్తాడు.
జులై 1న స్వామి దర్శనం ప్రారంభమైంది. 48 రోజులపాటు నిత్యం ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఇదీ చూడండి:- చిరుతతో 'టైగర్' ఫైట్- యజమాని సేఫ్