దేశంలో జూన్ నెలలో 3.33 శాతంగా ఉన్న కొవిడ్ మరణాల రేటు ప్రస్తుతం 2.15 కు చేరుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం 5 లక్షల 65 వేల 103 మంది బాధితులు చికిత్స పొందుతుండగా, రోజుకు సగటున 30 వేల మంది వైరస్ నుంచి కోలుకుంటున్నారు. రికవరీ రేటు 64.53 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వెయ్యి 488 కొవిడ్ ఆసుపత్రుల్లో 2 లక్షల 49 వేల 358 ఐసోలేషన్, 31 వేల 639 ఐసీయూ, లక్షా 9 వేల 119 ఆక్సిజన్ పడకలు, 16 వేల 678 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నట్లు వివరించింది.
కరోనాను ఎదుర్కొనేందుకు 2 కోట్ల 73 లక్షల 85 వేల ఎన్ 95 మాస్కులు సహా.. కోటి 21 లక్షల 5 వేల పీపీఈ కిట్లు, 10 కోట్ల 83 లక్షల హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఇదీ చూడండి: భాజపాలో సంస్థాగత మార్పులు- వారికే కీలక బాధ్యతలు!