కర్ణాటకలోని మండ్యలో నలుగురు విద్యార్థులపై ఓ బృందం మూకదాడికి పాల్పడింది. నాగమంగళ తాలుకాలోని నెల్లిగేరె ప్రాంతం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ కారులో ప్రయాణిస్తున్న నలుగురు విద్యార్థులపై 'మోరల్ పోలీసింగ్' పేరుతో కొందరు దుండగులు దాడికి పాల్పడ్డారు. విద్యార్థుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దాడి చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
కర్ణాటక మండ్యలో విద్యార్థులపై మూకదాడి - నాగమంగళ తాలుకాలోని నెల్లిగేరె
కర్ణాటకలో విద్యార్థులపై ఓ బృందం దాడికి పాల్పడింది. కారులో ప్రయాణిస్తున్న వారిని ఆపి మరీ దౌర్జన్యం చేశారు కొందరు దుండగులు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మోరల్ పోలీసింగ్ అంటూ రెచ్చిపోయారు.