అసోంలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల పలు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. శుక్రవారం నాటికి 3 లక్షల 81 వేల 320 మంది ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది.
గడిచిన 24 గంటల్లో గోలపారా, హోజాయ్ ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(ఏఎస్డీఎంఏ) తెలిపింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 350కి పైగా గ్రామాలు వరదల్లో చిక్కుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వరదల వల్ల 25వేల హెక్టార్ల పంట నష్టం సంభవించింది. సుమారు 21వేల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. వీరందరికీ జిల్లా యంత్రాగాలు.. ఏర్పాటు చేసిన శిబిరాల్లో ఆశ్రయం కల్పించారు అధికారులు.
ప్రముఖ ఒరాంగ్ జాతీయ ఉద్యానంపైనా వరద తీవ్ర ప్రభావం చూపించింది. అరుదైన జంతుజాతులు, ఒక కొమ్ము ఖడ్గ మృగానికి ఈ పార్కు నిలయం.
ఇదీ చూడిండి:భారీ వరదలు.. 3 లక్షల మందిపై తీవ్ర ప్రభావం