బిహార్, అసోం రాష్ట్రాల్లో నెలకొన్న వరద బీభత్సంలో మృతుల సంఖ్య 198కి చేరింది. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 2 కోట్ల మంది వరకు వరదల ప్రభావానికి గురయ్యారు. జల విలయం కొనసాగుతున్న జిల్లాల సంఖ్య బిహార్లో 13, అసోంలో 18 కి పెరిగింది.
వరదల ధాటికి బిహార్లో 123 మంది చనిపోగా.. అసోంలో 75 మంది ప్రాణాలు కోల్పోయారు.
అసోం..
కురిచ్చు నదిపై ఉన్న కురిచ్చు రిజర్వాయర్ నుంచి నీటిని కిందికి వదలటం వల్ల 7 జిల్లాల్లో వరదల ఉద్ధృతి పెరిగింది. అందులో బార్పేట, నల్బారి, బక్సా, చిరాంగ్, కొక్రాఝర్, దుబిడీ, దక్షిణ సల్మారా జిల్లా ఉన్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం 833 శిబిరాలను ఏర్పాటు చేసి బాధితులను తరలిస్తున్నారు. బ్రహ్మపుత్ర, జియా భరాలి, పుథిమరి, మనాస్, బేకి వంటి నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈ నదుల పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి.
బిహార్...
బిహార్లో వరదల ప్రభావానికి గురైన జిల్లాల సంఖ్య 13కు చేరింది. సుమారు 12 వందల గ్రామాలు నీట మునిగాయి. 123 మంది మృతుల్లో అత్యధికంగా సితామరి జిల్లాలో 37, మధుబానిలో 30 మంది మరణించారు.
ఇదీ చూడండి: మాలో ఎలాంటి విభేదాలు లేవు: ఎంపీ భాజపా