ETV Bharat / bharat

అసోం గజగజ.. వరదలకు 89 మంది మృతి - అసోం తాజా వార్త

అసోంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 26 జిల్లాలపై తీవ్ర ప్రభావం పడింది. 2,500లకు పైగా గ్రామాలు నీట మునిగాయి. ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 89 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కాజీరంగా జాతీయ పార్క్​లో 120కి పైగా జంతువులు మరణించాయి.

Assam floods claim 89 lives, affect 26 districts, says state Disaster Management Authority
వరదల గుప్పిట్లో ప్రజలు... 89 మంది మృతి
author img

By

Published : Jul 23, 2020, 7:34 AM IST

అసోంను వరదలు వదలటం లేదు. రాష్ట్రంలోని 26 జిల్లాలోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. 2,525 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి. ఈ వరదల కారణంగా ఇప్పటి వరకు 89 మంది మరణించారు. 1,15,515 హెక్టార్ల పంట భూమి నీట మునిగింది.

కాజీరంగా జాతీయ ఉద్యానవనం నీట మునిగిన కారణంగా 120 మూగజీవాలు మృతి చెందాయి. మరో 147 జంతువులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. మరి కొన్ని జంతువులు ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లినట్లు తెలిపారు. పలు ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, కల్వర్టులు, ఇళ్లు దెబ్బతిన్నాయి.

అసోంలో వరదలు

వరదల నేపథ్యంలో రంగంలోకి దిగిన అసోం విపత్తు నిర్వహణ అధికారులు, ఎన్​డీఆర్​ఎఫ్​ బలగాలు 45,281 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వీరిని మొత్తం 391 సహాయక శిబిరాలకు తరలించి.. వారికి కావాల్సిన నిత్యావసరాలను, ఇతర సామగ్రిని పంపిణీ చేస్తున్నారు.

రూ. 346 కోట్ల సాయం..

వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి... సహయక చర్యల్లో భాగంగా మొదటి విడతలో రూ. 346 కోట్లను విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. రాష్ట్ర పరిస్థితులపై అసోం ముఖ్యమంత్రి సర్బానందతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడిన కేంద్ర జల్​ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ ఈ మేరకు​ వెల్లడించారు.

ఇదీ చూడండి:గుడ్​న్యూస్​: అక్టోబరు కల్లా ఆక్స్​ఫర్డ్‌ టీకా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.