ETV Bharat / bharat

అసోంలో జలవిలయం- బిహార్​ను ముంచెత్తిన వరదలు - బిహార్​ వరదలు

కొద్దిరోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరభారతం తడిసి ముద్దవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో వరదప్రభావం ఎక్కువగా ఉండగా అసోంలో జలవిలయం కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో దాదాపు 27 లక్షల మంది వరదలకు ప్రభావితం కాగా.. బిహార్‌లోనూ పరిస్థితి దారుణంగా ఉంది.

assam, bihar-floods-situation
అసోంలో జలవిలయం- బిహార్​ను ముంచెత్తిన వరదలు
author img

By

Published : Jul 25, 2020, 8:15 AM IST

భారీగా కురుస్తున్న వర్షాలకు ఉత్తర, ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి. అసోం, బిహార్‌లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. దాదాపు 37 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అసోంలో బ్రహ్మపుత్ర సహా దాని ఉపనదులు ప్రమాదకరస్థాయి దాటి పరుగులు పెడుతూ పరివాహకాలను ముంచెత్తుతున్నాయి.

assam, bihar-floods-situation
అసోంలో జలవిలయం
assam, bihar-floods-situation
ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది సహాయం
assam, bihar-floods-situation
నీటమునిగిన ఇళ్లు
  1. అసోంలోని 33 జిల్లాల్లో 26 జిల్లాలు వరదగుప్పిట్లోకి జారుకున్నాయి. 2, 634 గ్రామాలు జలదిగ్భందంలోకి వెళ్లాయి.
  2. అసోంలో వరదలు సహా కొండచరియలు విరిగిపడి 122 మంది చనిపోయారు.
  3. 1,19,435 హెక్టార్లల్లో పంటనష్టం సంభవించింది.
  4. అసోంలోని జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కాజీరంగ పార్కు 92 శాతం వరకూ మునిగిపోయింది. 126 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.

బిహార్​ దారుణం...

assam, bihar-floods-situation
పడవలపై ప్రయాణం
assam, bihar-floods-situation
నీట మునిగిన ప్రాంతం
  • బిహార్‌లో కూడా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. గంధక్‌ నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తూ సమీప గ్రామాలపై విరుచుకుపడుతోంది.
    assam, bihar-floods-situation
    వరదల్లోనే పయనం
  • దాదాపు 10 లక్షల మంది ప్రజలు జలవిలయంలో చిక్కుకున్నారు.
  • ఉత్తర బిహార్‌లోనే అనేకి జిల్లాలు వరదగుప్పిట్లో ఉన్నాయి.
    assam, bihar-floods-situation
    ఎన్​డీఆర్​ఎఫ్​ సహాయం
  • ఇప్పటివరకు బిహార్‌లో వరదవిలయానికి 10 మంది చనిపోయారు.
  • పశ్చిమ చంపారన్‌లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే దాదాపు లక్షన్నర మంది బాధితులున్నారు.
  • దర్బాంగ, సీతామర్హి జిల్లాల్లోనూ వరదతీవ్రత ఎక్కువగా ఉంది. విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయచర్యలు కొనసాగిస్తున్నారు.
  • ఉత్తర్​ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ను కలిపే జాతీయరహదారి నంబర్ 28పై వరదనీరు ప్రవహించగా ట్రాఫిక్ నిలిచిపోయింది.
  • వరదల్లో చిక్కుకున్న వారికి సాయం చేసేందుకు నితీశ్ సర్కారు వాయుసేన సహకారం కోరింది.

ఇదీ చూడండి: 'ఆ ప్రాంతాల్లో బలగాలను పూర్తిగా వెనక్కి తీసుకుందాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.