అరుణాచల్ ప్రదేశ్..
గోహ్పుర్ నగరానికి సమీపంలోని ఓ గ్రామంలో కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు సమీపంలోని ఇంటిపై పడి పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఖరోయ్ నది ఉగ్రరూపం దాల్చింది. నదీతీరం కోతకు గురవటం వల్ల 20 గ్రామాలు నీట మునిగాయి. అందులో బొరసుక్, హొలమోరా, పిసోలా, నామ్ పిలోసా, ఖరోయ్గురి గ్రామాలు ఉన్నాయి.
అసోం...
అసోంలో భారీ వర్షాలకు జనోయ్ నగరం నీట మునిగింది. వరదలకు మోహ్మారా, కోప్లాంగ్ మోహ్మారా, బహిర్ జోనాయ్ రత్నాపుర్, ఆక్లాండ్ గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. నదీ పరివాహ ప్రాంతాల్లోని గ్రామాలు జలమయమయ్యాయి.
ఇదీ చూడండి: కన్నడనాట సంక్షోభం: ముంబయిలో హైడ్రామా