అసోం సంప్రదాయంలో భాగమైన 'బుల్ ఫైట్'ను శివసాగర్ జిల్లా అముగురి గ్రామ ప్రజలు వినూత్నంగా నిర్వహించారు. జంతువుల ఫైట్‌ను గతంలో సుప్రీంకోర్టు నిషేధించటం వల్ల.. వెదురు బొంగులు, వస్త్రాలతో కృత్రిమంగా రెండు ఎద్దుల ఆకృతులను చేశారు. వాటిలో ఇద్దరు వ్యక్తులు దూరి ఎద్దులవలే ఒకరితో ఒకరు ఫైట్ చేశారు.
ఇది నిజమైన బుల్ ఫైట్ కాకపోయినా.. సరదాగా ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రజలు పెద్దఎత్తున గుమిగూడారు.
దశాబ్దాలుగా అసోం సంస్కృతిలో భాగమైన బుల్ ఫైట్‌ను ప్రస్తుత యువతకు తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని ఊరి పెద్దలు తెలిపారు.