ఈ రోజు తెల్లవారుజామున 1.45 నిమిషాలకు అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. ప్రకంపనల వివరాల్ని అమెరికా భూ పరిశోధన సంస్థ ప్రకటించింది.
రాజధాని నగరం ఈటానగర్‌కు 180 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంప ప్రభావం 40 కిలోమీటర్ల మేర వ్యాపించింది. చదరపు కిలోమీటరుకు అతితక్కువ జన సాంద్రత కలిగిన అరుణాచల్ ప్రదేశ్ జనాభా 12 లక్షలు. అయితే ఈ దుర్ఘటనలో ఎంతమంది ప్రభావితం అయ్యారన్న విషయం తెలియరాలేదు.
చైనా అధికారిక న్యూస్ ఏజెన్సీ జింగ్హువా టిబెట్‌లో భూకంపం సంభవించినట్లు ప్రకటించింది. అరుణాచల్ ప్రదేశ్ భూభాగం తమదని చైనా దశాబ్దాలుగా వాదిస్తోంది.