ETV Bharat / bharat

అరుణాచల్​​లో మళ్లీ భాజపా సర్కారే... - భాజపా

అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో భాజపా విజయ దుందుభి మోగించింది. లోక్​సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. 60 సీట్ల అసెంబ్లీలో 57 స్థానాలకు మాత్రమే ఎన్నిక జరిగింది. 35 స్థానాలు సాధించి భాజపా విజయకేతనం ఎగురవేసింది.

అరుణాచల్​​లో మళ్లీ భాజపా సర్కారే!
author img

By

Published : May 24, 2019, 6:22 AM IST

అరుణాచల్​​లో మళ్లీ భాజపా సర్కారే!

ప్రకృతి అందాలకు నెలవైన ఈశాన్య రాష్ట్రం అరుణాచల్​ప్రదేశ్​లో మళ్లీ కమలం వికసించింది. లోక్​సభతో పాటు శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మరోసారి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది కమలం పార్టీ. 60 స్థానాల శాసనసభలో 35 స్థానాలు సాధించింది. జేడీయూ 7, కాంగ్రెస్ 4 సీట్లు సాధించాయి.

మొత్తం స్థానాలు 60
భాజపా 35
జేడీయూ 7
కాంగ్రెస్ 4
ఎన్​పీఏ 1
పీపీఏ 1

సూర్యుడు ఉదయించే రాష్ట్రంలో క్రితం ఎన్నికలతో పోలిస్తే తాజాగా రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2014 విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 42 సీట్లు గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

రెండు సంవత్సరాలు గడవగానే 2016లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అనేక మంది ముఖ్యమంత్రులు మారారు. చివరకు... పాలనా పగ్గాలే చేతులు మారాయి. పీపుల్స్​ పార్టీ ఆఫ్​ అరుణాచల్​(పీపీఏ)కు చెందిన 33మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది.

అభివృద్ధి నినాదంగా భాజపా...

అభివృద్ధే ప్రధానాంశంగా భాజపా ఎన్నికల బరిలో దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్​ షా... రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించారు.
అరుణాచల్​ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన నేషనల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీపీ)... తాము పోటీచేయని స్థానాల్లో భాజపాకు మద్దతు ఇచ్చింది.

పౌరసత్వ బిల్లు ప్రధానాంశంగా విపక్షాలు

పౌరసత్వ బిల్లు, శాశ్వత నివాస ధ్రువీకరణ అంశాలపై విపక్షాలు ప్రచారం నిర్వహించాయి. దీనితో పాటు అవినీతి, శాంతి భద్రతలూ ప్రధాన అజెండాగా మార్చుకున్నాయి. అయితే వీటిని ప్రజలు విశ్వసించలేదని ఫలితాలు ధ్రువీకరించాయి.

పనిచేయని ప్రత్యేక హోదా...

ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార పక్షాన్ని ఢీ కొట్టటానికి ప్రత్యేక హోదా అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. తాము అధికారంలోకి వస్తే అరుణాచల్​ప్రదేశ్​కు హోదా ఇస్తామంటూ కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ ప్రకటించినప్పటికీ ఓటర్లు మొగ్గుచూపలేదు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Saint-Germain-en-Laye, Paris, France. 23rd May 2019
1. 00:00 Kylian Mbappe
2. 00:19 Edison Cavani
3. 00:35 Thomas Tuchel with PSG squad
SOURCE: SNTV
DURATION: 00.46
STORYLINE:
PSG travel to Reims for their final game of the season on Friday, with Kylian Mbappe needing four goals to catch Lionel Messi in the European golden boot.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.