ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న భాజపా సీనియర్ నేత అరుణ్‌జైట్లీని.... కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పరామర్శించారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్తల నేపథ్యంలో భాజపా నేతలు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు.
అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కూడా ఎయిమ్స్‌కు చేరుకుని జైట్లీని పరామర్శించారు.
ఎయిమ్స్‌లో చికిత్స
శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతున్న అరుణ్ జైట్లీని ఈ నెల 9న కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌లో చేర్చారు. గతేడాది మేలో కిడ్నీ మార్పిడి చేయించుకున్న జైట్లీ... అంతకు ముందు బేరియాట్రిక్ శస్త్ర చికిత్స కూడా చేయించుకున్నారు. ఇటీవల ఆయనకు అరుదైన కేన్సర్ సోకినట్లు గుర్తించారు.
ఇదీ చూడండి: రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి