రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్ణబ్ గోస్వామిని ఆదివారం మహారాష్ట్రలోని తలోజా జైలుకు తరలించారు పోలీసులు. ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో నవంబర్ 4న అర్ణబ్‌ను అరెస్ట్ చేసి.. రాయ్‌గఢ్‌లోని అలీబాగ్ కరోనా క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్న అర్ణబ్.. అలీబాగ్ జైల్లో మొబైల్ ఫోన్ వాడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ కారణంగానే తలోజా జైలుకు మార్చినట్టు అధికారులు వెల్లడించారు.
అర్ణబ్‌ను అరెస్ట్ చేసే సమయంలో ఆయన వ్యక్తిగత ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయినప్పటికీ జైల్లో ఉన్న ఇతరుల మొబైల్ ఫోన్‌ను వాడుతూ.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించారు.
ఇదీ చదవండి: అర్ణబ్ కోసం పాఠశాలను జైలుగా మార్పు!
వ్యాన్ నుంచే కేకలు..
తలోజా జైలుకు తీసుకెళ్లే క్రమంలో వ్యాన్ నుంచి గట్టిగట్టిగా అరిచారు అర్ణబ్. అలీబాగ్ జైలర్.. శనివారం సాయంత్రం తనపై దాడి చేశారని ఆరోపించారు. తన జీవితం ప్రమాదంలో పడిందని, కనీసం లాయర్‌తోనూ మాట్లాడటానికి అనుమతించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు అర్ణబ్ దరఖాస్తు చేసుకున్న మధ్యంతర బెయిల్‌పై.. ముంబయి హైకోర్టు సోమవారం తీర్పును వెలువరించనుంది.
ఇవీ చదవండి: