పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థానీ సైనికులు కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో ఓ భారత జవాన్ వీరమరణం పొందాడు.
పూంచ్‌లోని కృష్ణాఘాటీ సెక్టార్లో ఉన్న నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ సైనికులు కాల్పులు జరిపారు. అయితే భారత ఆర్మీ దీటుగా స్పందించింది. కాగా కాల్పుల్లో భారత జవాన్ హవల్దార్ నిర్మల్‌సింగ్ తీవ్రగాయాలపాలై మృతిచెందాడు.
---ఆర్మీ ప్రతినిధి.
సింగ్ గొప్ప యోధుడని ఆర్మీ అధికార ప్రతినిధి కొనియాడారు. అతని త్యాగానికి దేశం రుణపడి ఉంటుందని అన్నారు.
ఇదీ చూడండి: పాక్ వక్రబుద్ధి- సరిహద్దుల్లో మళ్లీ దాడులు