ETV Bharat / bharat

21ఏళ్ల క్రితం అదృశ్యం.. కుమార్తె పెళ్లికి తిరిగొచ్చిన తండ్రి - son met with his father after 21 years

మిఠాయి దుకాణంలో పనిచేసేందుకు వెళ్లి అదృశ్యమైన ఓ వ్యక్తి 21 ఏళ్ల తర్వాత తిరిగొచ్చాడు. అతడిపై ఆశలు వదులుకున్న కుటుంబం.. అనూహ్యంగా ఆయన తిరిగొచ్చే సరికి ఆనందభాష్పాలతో కన్నీటి పర్యంతమైంది. త్వరలో కుమార్తె పెళ్లి జరగనున్న నేపథ్యంలో తండ్రి రావడం వల్ల ఆ ఆనందం రెట్టింపు అయ్యింది.

son
21ఏళ్ల క్రితం అదృశ్యం.. కుమార్తె పెళ్లికి తిరిగొచ్చిన తండ్రి
author img

By

Published : Feb 28, 2020, 8:52 PM IST

Updated : Mar 2, 2020, 9:43 PM IST

21ఏళ్ల క్రితం అదృశ్యం.. కుమార్తె పెళ్లికి తిరిగొచ్చిన తండ్రి

మన అనుకునే వాళ్లు వేరొక చోట నివసిస్తుంటే క్షేమ సమాచారం ఉంటే నిశ్చింతగా ఉంటాం. వారినుంచి సమాచారం అందకపోతే హైరానా పడిపోతుంటాం. అయితే ఓ కుటుంబం తమ ఇంటి పెద్ద దిక్కు ఉన్నాడో.. లేడో అనే సందిగ్ధంలోనే గడిపింది. ఎక్కడో ఓ చోట కాలం చేసి ఉంటాడని భావించింది. ఈ క్రమంలోనే ఆ కుటుంబానికి ఓ ఆశ్రమం నుంచి అందిన కబురు వారి దశాబ్దాల దుఃఖాన్ని దూరం చేసింది.

ఇదీ జరిగింది..

అది 1999వ సంవత్సరం. యూపీకి చెందిన బైజ్​నాథ్ పంజాబ్​లోని మిఠాయి దుకాణంలో పనిచేసేవాడు. ఏమైందో ఏమో కానీ అకస్మాత్తుగా అతడు అదృశ్యం అయ్యాడు. అప్పటికి బైజ్​నాథ్​కు 22 ఏళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడికి మూడేళ్లు, కుమార్తెకు ఏడాదిన్నర. ఆ సమయంలో బైజ్​నాథ్​ ఆచూకీ కనుక్కునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది కుటుంబం. అయితే ఎంతకూ ఆచూకీని లభించలేదు.

అయితే కొన్ని మాసాల కిందట గాయాలతో, అనారోగ్యంతో అపస్మారక స్థితిలో అప్​నా ఘర్ ఆశ్రమాన్ని చేరాడు బైజ్​నాథ్. 8 మాసాలకు పైగా చికిత్స అనంతరం కోలుకున్నాడు. సంస్థ నిర్వాహకులు బైజ్​నాథ్ ఆచూకీని యూపీలోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తమ తండ్రి బతికే ఉన్నాడనే సమాచారంతో హుటాహుటిన రాజస్థాన్​లోని భరత్​పుర్​ అప్​నా ఘర్ ఆశ్రమానికి చేరారు బైజ్​నాథ్ కుమారుడు, సోదరుడు. దశాబ్దాల అనంతరం తన వాళ్లని చూసి కన్నీటి పర్యంతమయ్యాడు బైజ్​నాథ్. ఒక్కటిగా కూడి రోదించారు. 21 ఏళ్ల అనంతరం కలిసిన ఆ కుటుంబాన్ని చూసి అక్కడున్న వారి కళ్లలో నీళ్లు తిరిగాయి.

"బెహజ్ గ్రామం వద్ద గాయాలతో బైజ్​నాథ్ మా ఆశ్రమ నిర్వాహకులకు కనిపించాడు. గోబధన్ ఆశ్రమానికి తీసుకొచ్చారు. అయితే అక్కడ అతడికి అవసరమైన చికిత్స అందించలేని కారణంగా భరత్​పుర్​కు తీసుకొచ్చారు. 8 నెలలపాటు చికిత్స అందించిన అనంతరం బైజ్​నాథ్ వ్యాధి నయమైంది. అతడు తన ఆచూకీ మాకు తెలిపాడు. మేం కుటుంబసభ్యులను సంప్రదించాం. వారు అతడిని తీసుకెళ్లేందుకు భరత్​పుర్​కు వచ్చారు."

-డాక్టర్​ భరద్వాజ్, ఆశ్రమ నిర్వాహకుడు

కుమార్తె పెళ్లికి..

బైజ్​నాథ్ అదృశ్యమైనప్పుడు తన కూతురి వయస్సు ఒకటిన్నర ఏళ్లు. త్వరలో కుమార్తె వివాహం జరగనున్న నేపథ్యంలో తండ్రి రావడం సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బైజ్​నాథ్ ఆచూకీ లభ్యమయ్యేందుకు సహకరించిన అప్​నా ఘర్ ఆశ్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: దిల్లీ అల్లర్లలో తప్పిపోయిన 13 ఏళ్ల బాలిక సురక్షితం

Last Updated : Mar 2, 2020, 9:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.