ETV Bharat / bharat

కుష్టు వ్యాధి వ్యాక్సిన్​తో కరోనా చికిత్స! - కరోనా వైరస్​ వార్తలు ఇండియా

ఛండీగఢ్​లోని పీజీఐఎమ్​ఈఆర్​ వైద్యులు కరోనా రోగులపై కుష్టు వ్యాధి వ్యాక్సిన్​ను ఉపయోగించి ట్రయల్స్​ నిర్వహించారు. ఈ పరిశోధనలో సంతృప్తికర ఫలితాలు వచ్చాయని తెలిపారు.

Anti-leprosy vaccine effective in treating COVID-19 patients
వైరస్​పై పోరుకు యాంటీ లెప్రాసీ వ్యాక్సిన్​తో ట్రయల్స్​
author img

By

Published : Apr 26, 2020, 2:40 PM IST

కరోనాపై పోరులో విజయం సాధించడానికి వైద్య పరిశోధకులు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా ఛండీగఢ్​లోని పోస్ట్​ గ్రాడ్యుయేషన్​ ఇన్స్​టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ ఎడ్యుకేషన్​ అండ్​ రీసర్చ్​(పీజీఐఎమ్​ఈఆర్​)లో.. వైరస్​ చికిత్సకు యాంటీ లెప్రసీ వ్యాక్సిన్​ను ఉపయోగించారు. ఈ ట్రయల్స్​ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు నిపుణులు.

నలుగురు రోగులకు కుష్టు వ్యాధి నివారణ వ్యాక్సిన్​ అయిన​ మైకోబాక్టీరియమ్​ డబ్ల్యూ (ఎమ్​డబ్ల్యూ)ను 0.3ఎమ్​ఎల్​ చొప్పున మూడు రోజుల పాటు అందించినట్టు వివరించారు ప్రొఫెసర్​ జగత్​రామ్.

"లెప్రసీ, క్షయ, నిమోనియా బాధితులపై ఇది ప్రయోగించినప్పుడు ఎలాంటి సైడ్​ ఎఫెక్ట్స్​ను మేము గుర్తించలేదు. దిల్లీ ఎయిమ్స్​, భోపాల్​ ఎయిమ్స్​ దీనిపై క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహిస్తాయి. ప్రస్తుతానికి నలుగురిపై ఈ వ్యాక్సిన్​ను ప్రయోగించాం. త్వరలోనే ఇతర రోగులకు దీనితో చికిత్స చేస్తాం."

--- ప్రొఫెసర్​ జగత్​రామ్​, పీజీఐఎమ్​ఈఆర్.​

బాధితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎమ్​డబ్ల్యూను ఉపయోగిస్తున్నట్టు వివరించారు మరో ప్రొఫెసర్​ రితేశ్​ అగర్వాల్​ .

"వ్యాక్సిన్ ప్రయోగించే రోగులకు కృత్రిమ శ్వాస అందించాం. సాధారణంగా వైరస్​ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే రోగ నిరోధక కణాలు దాన్ని అడ్డుకుంటాయి​. కానీ బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమిస్తే.. రోగ నిరోధక కణాలు సరిగా పోరాడలేవు. అందుకే వాటిలో శక్తిని పెంచడానికి ఈ ఎమ్​డబ్ల్యూ​ వాడుతున్నాము. ఈ చికిత్సకు ఎంత ఆక్సిజన్​ అవసరమో చూడాలి. ఏదైనా సైడ్​ ఎఫెక్ట్స్​ ఉంటాయో లేదో తెలుసుకోవడానికి వారిని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం."

--- పీజీ రితేశ్​ అగర్వాల్​, ప్రొఫెసర్​ పీజీఐఎమ్​ఈఆర్​.

అనేక మందిపై ఇప్పటికే సెఫ్టీ ట్రయల్స్​ చేసినట్టు.. ఇక మరణాల రేటుపై ఈ ఎమ్​డబ్ల్యూ ఏ మేరకు ప్రభావం చూపుతుందో పరిశీలించాలని పేర్కొన్నారు మరో ప్రొఫెసర్​ దిగంబర్​ బెహెరా. ఎంత మొత్తంలో ఈ మందును వాడుతున్నామన్నదీ ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. ట్రయల్స్​ పూర్తయ్యాక వీటిపై స్పష్టత వస్తుందన్నారు.

ఇదీ చూడండి- పౌరులంతా సైనికులే.. అందరికీ సెల్యూట్​: మోదీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.