పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలు చేసిన ప్రతిపక్ష డీఎంకే... తాజాగా వినూత్నరీతిలో ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేసింది. డీఎంకే అధినేత స్టాలిన్, కనిమొళి నివాసాల ముందు పౌర చట్టం, జాతీయ పౌర పట్టికలకు వ్యతిరేకంగా రంగవల్లులు వేసి నిరసన వ్యక్తం చేశారు. అంతేకాక కార్యకర్తలు సైతం ఇందులో పాల్గొనాలని డీఎంకే ఎంపీ కనిమొళి పిలుపునిచ్చారు.
పోలీసుల చర్యకు నిరసన
మరోవైపు పౌర చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ముగ్గులు వేసి నిరసన వ్యక్తం చేసినందుకు ఆదివారం ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారు. పోలీసుల చర్యకు నిరసనగా మరింత మంది ఇదే బాటలో పయనించారు. ఆదివారం సాయంత్రం వరకు చాలా మంది ప్రజలు తమ ఇళ్ల ముందు సీఏఏ,ఎన్సీఆర్లకు వ్యతిరేకంగా ముగ్గులు వేశారు.
ఇదీ చదవండి: పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ముగ్గులు వేసినందుకు 8 మంది అరెస్టు