ETV Bharat / bharat

ఫేస్​బుక్​కు అంఖీ దాస్ రాజీనామా.. కారణమిదే!

గత కొంతకాలంగా విద్వేషపూరిత ప్రసంగాల విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫేస్​బుక్​ నుంచి ఆ సంస్థ పబ్లిక్​ పాలసీ హెడ్​ అంఖీ దాస్​ వైదొలిగారు. ఈ మేరకు ఆమె రాజీనామా చేసినట్లు ఆ సంస్థ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.

Ankhi Das, Facebook's head of public policy has quit the company
ఫేస్​బుక్​ భారత పబ్లిక్​ పాలసీ హెడ్​ పదవి నుంచి వైదొలిగిన అంఖిదాస్​
author img

By

Published : Oct 27, 2020, 9:27 PM IST

ఫేస్​బుక్​ భారత పబ్లిక్​ పాలసీ హెడ్​ పదవి నుంచి అంఖీ దాస్​ తప్పుకున్నారు. ఈ మేరకు ఆ సంస్థకు చెందిన ఉన్నతాధికారి ఒకరు స్వయంగా వెల్లడించారు. గత కొంతకాలంగా విద్వేషపూరిత ప్రసంగాలు, కంటెంట్​ నిర్వహణ విషయంలో ఫేస్​బుక్​ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దాస్​ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

అంఖీ దాస్​ ఫేస్​బుక్​ నుంచి వైదొలిగారు. సంస్థ భారత్​లో అడుగుపెట్టినప్పుడు చేరిన ఉద్యోగుల్లో ఆమె ఒకరు. తొమ్మిది సంవత్సరాలుగా సంస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు.

-అజిత్ మోహన్ ,ఫేస్‌బుక్ ఇండియా ఎండీ

ఇకపై ప్రజాసేవలో...

ఫేస్​బుక్​కి రాజీనామా చేసిన అంఖీ దాస్​ ఇకపై ప్రజాసేవలోకి రానున్నట్లు వీడ్కోలు సమావేశంలో తెలిపారు. 2011లో సంస్థలో చేరినప్పటి తన అనుభవాలను నెమరు వేసుకున్నారు. దేశంలో ప్రజలను కలిపే దిశగా మేము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు తెలిపారు. ప్రపంచానికి ఓ అద్భుతాన్ని అందించిన మార్క్​ జూకర్​ బర్గ్​కి ధన్యవాదాలు తెలియజేశారు.

ఇదీ చూడండి: ఫేస్​బుక్​, వాట్సాప్​పై దర్యాప్తునకు రాహుల్ డిమాండ్

తీవ్ర విమర్శలు...

ఫేస్​బుక్​ ఇండియా పబ్లిక్​ పాలసీ హెడ్​గా అంఖీ దాస్​ ఉన్న సమయంలో దేశంలోని రాజకీయ పార్టీలు అన్నీ తీవ్ర విమర్శలు చేశాయి. సంస్థ ఉద్యోగిగా ఉంటూ భాజపాకు మద్దతుగా ఫేస్‌బుక్ గ్రూపుల్లో పోస్ట్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంస్థ నుంచి దాస్​ను‌ తొలగించాలని డిమాండ్లు వినిపించాయి.

ఇదీ చూడండి: వివాదంలో బుక్కైన ఫేస్‌బుక్‌.. అసలేంటీ రగడ?

వాల్​స్ట్రీట్​ జర్నల్​ కథనంతో వెలుగులోకి...

భారత్‌లో ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లను భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రిస్తాయని అమెరికన్​ వార్తా సంస్థ ది వాల్​స్ట్రీట్​ జర్నల్​ ఓ కథనాన్ని ఆగస్టులో ప్రచురించింది. ఈ కథనంతో అంఖీ దాస్​ వెలుగులోకి వచ్చారు. ఈ విషయంపై ఫేస్​బుక్​ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

ఇదీ చూడండి: 'ఫేస్​బుక్​ నిష్పాక్షికంగా, తటస్థంగానే పనిచేస్తోంది'

ఇదీ చూడండి: 'పక్షపాతంగా వ్యవహరించం- హింసను సమర్థించం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.