నీతి ఆయోగ్ సీఈఓగా అమితాబ్ కాంత్ మరో రెండేళ్లు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్ 30 వరకు ఆయన సీఈఓగా కొనసాగుతారు.
1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అమితాబ్ కాంత్.. 2016 ఫిబ్రవరి 17న నీతి ఆయోగ్ సీఈవోగా నియమితులయ్యారు. నీతి ఆయోగ్ సీఈఓ పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుంది. 2018లో ఆయన పదవీకాలం పూర్తయినప్పుడు 2019 జూన్ 30 వరకు పొడిగిస్తూ అప్పటి కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం మరో రెండేళ్లు పొడిగించింది.
నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టకముందు పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు అమితాబ్. ప్రస్తుతం ఈ విభాగాన్ని 'డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్'గా పిలుస్తున్నారు.
ఇదీ చూడండి: బాలాకోట్ దాడుల వ్యూహాకర్తకు 'రా' బాధ్యతలు