భారత పర్యటనలో అగ్ర దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. ఆయన పసుపు రంగు టైతో ముదురు రంగు సూట్‌ను ధరించారు. అమెరికాలో విమానం ఎక్కేముందు ఆయన ఎర్రటి టై ధరించి ఉండగా భారత్‌లో అడుగు పెట్టేటప్పుడు మాత్రం పసుపు రంగుది దర్శనమిచ్చింది. ఈ ఆహార్యంపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు స్పందించారు.
భారత్-అమెరికా సంబంధాల్లో కొత్త వసంతం తెచ్చే ఆలోచనలతోనే ఆయన పసుపు రంగును ప్రదర్శించారని కొందరు వ్యాఖ్యానించారు. పసుపు... ఆశావాహ దృక్పథానికి, సంతోషానికి చిహ్నమని, నలుపు... అధికార దర్పానికి, బలానికి గుర్తుగా నిలుస్తుందని కొందరు రాశారు.