బీఆర్ అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్ వివాదంలో చిక్కుకున్నారు. మహారాష్ట్ర యావత్మల్ జిల్లాలో జరిగిన సభలో ఆయన ఈసీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
"పుల్వామా ఉగ్రదాడిలో మనం 40 మంది వీర జవాన్లను కోల్పోయాం. అయినా నిశ్శబ్దంగా ఉన్నాం. మనల్ని ఈ దాడిపై మాట్లడకూడదన్నారు. ఈసీ ఈ విధంగా ఎలా కట్టడి చేస్తుంది? రాజ్యాంగం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది. నేను భాజపాలా కాదు. ఎన్నికల్లో గెలిస్తే.. ఈసీని రెండు రోజులు జైల్లో వేస్తా"
-ప్రకాశ్ అంబేడ్కర్, భారిప్ బహుజన్ మహాసంఘ్ అధ్యక్షుడు
ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం గురువారం స్పందించింది. ప్రకాశ్ చేసిన ప్రసంగంపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల అధికారులను ఆదేశించింది. ప్రకాశ్ అంబేడ్కర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టం చేసింది. ఆయనపై యావత్మల్ జిల్లా కలెక్టర్ దిగ్రాస్ పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షోలాపూర్, అకోలా నియోజకవర్గాల నుంచి ప్రకాశ్ ఎన్నికల బరిలో నిలిచారు.