ETV Bharat / bharat

దిల్లీ అల్లర్లపై రాజకీయ పార్టీల మాటల యుద్ధం - all political parties conddemned delhi voilence accused central govt is failed to stop protests

దిల్లీ అల్లర్లపై పలు రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. అల్లర్లను కేంద్రం నియంత్రించలేకపోయిందని మండిపడ్డాయి. ఈ ఘటనకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను భాజపా తిప్పికొట్టింది. శాంతి పునరుద్ధరణకు అన్ని పార్టీలు సహకరించాలని, అందుకు భిన్నంగా ప్రభుత్వాన్ని తప్పుబట్టడం చిల్లర రాజకీయం అవుతుందని విమర్శించింది.

all political parties conddemned delhi voilence accused central govt is failed to stop protests
దిల్లీ అల్లర్లపై రాజకీయ పార్టీల మాటల యుద్ధం
author img

By

Published : Feb 26, 2020, 6:56 PM IST

Updated : Mar 2, 2020, 4:05 PM IST

దిల్లీలో అల్లర్లపై రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. అల్లర్లను ప్రేరేపిస్తోంది భాజపానే అని ముక్త కంఠంతో ఆరోపించాయి.

దిల్లీ ఘటనపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది కాంగ్రెస్. తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నా బలగాలను మోహరించడంలో ఎందుకు అలసత్వం వహించారని కేంద్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ.

"దిల్లీలో నిరసనలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోంమంత్రి బాధ్యులు. దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలి. కొందరు భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు దిల్లీలో భయాందోళనలు రేకెత్తించాయి."

-సోనియా గాంధీ, కాంగ్రెస్ అధినేత్రి

శాంతి నెలకొల్పడంలో దిల్లీ ముఖ్యమంత్రి సైతం విఫలమయ్యారని విమర్శించారు సోనియా. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసికట్టుగా పనిచేయాలని హితవు పలికారు.

రాజీనామా చేయాల్సిందే

పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి రాజ్​ఘాట్​ వరకు శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించింది కాంగ్రెస్. అయితే పోలీసులు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా ఇతర నేతల్ని జన్​పథ్​ రోడ్​లోనే అడ్డుకున్నారు.

దిల్లీలో శాంతిని నెలకొల్పడంలో కేంద్రం విఫలమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. హోంమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దిల్లీని నాశనం చేశారని మండిపడ్డారు.

"ప్రజలు ఉపాధి కోసం ఈ నగరానికి వస్తారు. ఇప్పుడు నగరంలో విద్వేషం వ్యాప్తి చెందుతోంది. దేశ రాజధానిలో శాంతి నెలకొల్పడం ప్రభుత్వ బాధ్యత. కానీ వారు విఫలమయ్యారు. హోంమంత్రి ఇంటిని ముట్టడించి తన రాజీనామా కోసం డిమాండ్ చేయాలనుకున్నాం. కానీ పోలీసులు అడ్డుకున్నారు."

-ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి

గుజరాత్ అల్లర్లను తలపిస్తోంది

దిల్లీలో జరుగుతున్న హింసాత్మక నిరసనలు 2002 నాటి గుజరాత్ అల్లర్లను తలపిస్తున్నాయని సీపీఎం నేత సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. సైన్యాన్ని రంగంలోకి దించడం ద్వారానే శాంతి స్థాపన చేయవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజాతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఏచూరి.

"దిల్లీ అల్లర్లకు అసెంబ్లీ ఎన్నికల నుంచే కుట్ర చేస్తున్నారు. భాజపా నేతలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారు. దిల్లీ పోలీసులు సాధారణ పరిస్థితిని తీసుకురావడంలో విఫలం అయ్యారు. కర్ఫ్యూ విధించినా అల్లర్లు కొనసాగడం విస్మయానికి గురి చేస్తోంది. కేంద్ర హోంశాఖ ఈ పరిస్థితిపై సమాధానం ఇవ్వాలి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పూర్తి స్థాయి బాధ్యత వహించాలి."

-సీతారాం ఏచూరి, సీపీఎం నేత జాతీయ ప్రధాన కార్యదర్శి

తిప్పికొట్టిన భాజపా

ప్రతిపక్షాల ఆరోపణలను అధికార భాజపా తిప్పికొట్టింది. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఎదురుదాడికి దిగింది. అల్లర్లకు కేంద్రమే బాధ్యత వహించాలన్న సోనియా వ్యాఖ్యలను ఖండించింది.

కాంగ్రెస్​ ప్రకటన దురదృష్టకరమని... అల్లర్ల సమయంలో శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రమంత్రి ప్రకాశ్​ జావడేకర్ వ్యాఖ్యానించారు. అందుకు భిన్నంగా ప్రభుత్వాన్ని తప్పుబట్టడం చిల్లర రాజకీయం అవుతుందని మండిపడ్డారు. హింసపై రాజకీయం చేయడం ఏమాత్రం తగదని హితవు పలికారు.

"అమిత్​ షా ఎక్కడున్నారని వారు అడిగారు. ఆయన నిన్న అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అందులో కాంగ్రెస్​ నాయకులు కూడా ఉన్నారు. ఆమ్​ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి సహా ఇతర నేతలు ఉన్నారు. ఘటనలపై పోలీసులకు దిశా నిర్దేశం చేశారు హోంమంత్రి. వారిలో ధైర్యాన్ని నింపారు. కాంగ్రెస్​ ప్రకటనలు పోలీసుల మనోధైర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి."-ప్రకాశ్ జావడేకర్, కేంద్ర మంత్రి

దిల్లీలో పరిస్థితి అదుపులోకి వస్తోందని చెప్పారు జావడేకర్. హింస చెలరేగడం వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతుందని గుర్తుచేశారు. హింసకు పాల్పడిన వారిని వదిలేదిలేదని స్పష్టం చేశారు. గతేడాది ఇదే రోజు జరిగిన బాలాకోట్ ఆపరేషన్​ సమయంలో కాంగ్రెస్​ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు కేంద్ర మంత్రి. అప్పుడు కూడా కేంద్రంపై ఆరోపణలు చేశారని గుర్తుచేశారు.

Last Updated : Mar 2, 2020, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.