ETV Bharat / bharat

లాక్‌డౌన్‌ కొనసాగిస్తారా? ఏమైనా మార్పులుంటాయా?

కరోనా వ్యాప్తి నియంత్రణకు దేశ వ్యాప్తంగా 21రోజలు లాక్​డౌన్​ విధిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఆ గడువు ఇంకో రెండు రోజుల్లో ముగియబోతుంది. అయితే దేశంలో వైరస్​ బాధితులు తగ్గడానికి బదలు పెరుగుతుంటడం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డాన్​ను ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో లాక్​డౌన్​ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే లాక్​డౌన్​ కొనసాగుతుందా? ఏమైనా మినహాయింపులు ఉంటాయా?

author img

By

Published : Apr 12, 2020, 4:53 PM IST

ఏప్రిల్‌ 14.. ప్రధాని చెప్పిన 21 రోజుల లాక్‌డౌన్‌ గడువు ముగియబోయే రోజు. కరోనా వైరస్‌ కట్టడికి కేంద్రం తీసుకున్న కఠినమైన ఈ నిర్ణయానికి ఈ పాటికే ఫలితం వచ్చి ఉండాలి. అయితే కేసులు తీవ్రత తగ్గాల్సింది పోయి కొత్త కేసులు వెలుగు చూడడం ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు మరోసారి లాక్‌డౌన్‌ అంశం తెరపైకి వచ్చింది. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ.. రెండింటికీ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఉంటుందా? ఉంటే ఎలా ఉండబోతోంది? ఏమైనా మినహాయింపులుంటాయా?

రాష్ట్రాలు ఏమంటున్నాయ్‌?

కరోనా వైరస్‌ కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే ఏకైక మార్గమని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు లాక్‌డౌనే సంజీవని అనే విషయం తేటతెల్లమవుతుంది. కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో సైతం ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. శనివారం సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో సైతం మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇప్పటికే పంజాబ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాలు ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే, దేశవ్యాప్త లాక్‌డౌన్‌పై మాత్రం కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ప్రకటన ఎప్పుడు?

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ గత ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలతో మాట్లాడారు. బుధవారం విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల అభిప్రాయం తీసుకున్నారు. శనివారం సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లాక్‌డౌన్‌ పొడిగించే విషయంలో ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా ఈ భేటీలు నిర్వహించారన్నది దీనిబట్టి అర్థమవుతోంది. అయితే, మరో విడత లాక్‌డౌన్‌ విధించాలంటే ఆర్థిక వ్యవస్థనూ దృష్టిలో ఉంచుకుని చేపట్టాలన్నది ప్రధాని ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే సీఎంలతో భేటీ సందర్భంగా 'ఇటు ప్రాణాలతో పాటు అటు ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమే' అని ప్రధాని వ్యాఖ్యానించారు. దీనిబట్టి ఈ సారి లాక్‌డౌన్‌లో కొన్ని మార్పులుంటాయనేది సుస్పష్టం. అయితే, ఆయా వర్గాల నుంచి వచ్చిన అభిప్రాయాలపై మంగళవారం మరోసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ప్రధాని లాక్‌డౌన్‌ నిర్ణయం ప్రకటిస్తారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కరోనా వైరస్‌పై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్న ప్రధాని ఏ సమయంలోనైనా లాక్‌డౌన్‌ నిర్ణయంతో ముందుకు రావొచ్చనీ తెలుస్తోంది.

ఉంటే మార్పులేమిటి?

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఇప్పటికే జనజీవనం స్తంభించిపోయింది. పరిశ్రమలు మూతపడ్డాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం దారుణంగా పడిపోయింది. ఇప్పటికే మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బే. అందుకే దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఈ సారి ఉండకపోవచ్చన్నది అంచనా. ఈ సారి స్మార్ట్‌ లాక్‌డౌన్‌ ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అంటే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించి.. మిగిలిన జిల్లాల్లో పరిమిత ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్‌ విధిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్‌ ఉన్న జిల్లాలను రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్లుగా విభజించారు. ఆయా జిల్లాలు ఉండే జోన్‌ బట్టి ఆంక్షలు ఉండనున్నాయని తెలుస్తోంది.

వీటికి మినహాయింపు ఉండొచ్చు..

వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తారని తెలుస్తోంది. లాక్‌డౌన్‌ పొడిగించిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఈ విషయం స్పష్టంచేసింది. అలానే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల విషయంలోనూ మినహాయింపు ఉండే అవకాశం ఉంది. పరిమిత సంఖ్యలో ఇక్కడ శ్రామిక శక్తి అవసరం కాబట్టి ఇక్కడ సామాజిక దూరం పాటించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గుమిగూడడానికి అవకాశం ఉండే పాఠశాలలు, మాల్స్‌, థియేటర్లకు మాత్రం ఏమాత్రం అనుమతివ్వకపోవచ్చు. లాక్‌డౌన్‌ కంటే ముందే వీటిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం గమనించదగ్గ విషయం. మరీ ముఖ్యంగా ప్రయాణాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో వైరస్‌ తీవ్రత ఒక్కోలా ఉంది. ఒకవేళ ప్రయాణాలకు అనుమతిస్తే పరిస్థితి పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉందన్నది గమనించాలి. మొత్తంగా కరోనా తీవ్రత పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ ఖాయంగా కనిపిస్తోంది. అయితే, అది ఏ తరహా లాక్‌డౌన్‌ అనేది తెలియాలంటే ప్రధాని నిర్ణయం వెలువడే వరకు వేచి చూడాల్సిందే!

ఇదీ చూడండి: ఈ ఏడాది చివరి వరకు వృద్ధులంతా క్వారం​టైన్​లోనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.