ఉగ్రవాదులకు అండగా నిలిచే దేశాలను ఏకాకిని చేయడానికి ప్రపంచదేశాలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ముష్కర మూకల నుంచి మాతృదేశాన్ని రక్షించడానికి అమరులైన జవాన్లకు ఉగ్రవాద వ్యతిరేక దినం సందర్భంగా నివాళులు అర్పించారు.
"మానవులకు అతిపెద్ద శత్రువు ఉగ్రవాదం. ప్రపంచ శాంతికి విఘాతం కలిగించేది ఉగ్రవాదమే. ఏ రకంగా అయినా ఉగ్రవాదులకు సాయం చేసే దేశాలను వేరు చేయడానికి ప్రపంచ దేశాలు ఏకం కావాలి. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్న భద్రతా బలగాలకు దేశ పౌరులంతా మద్దతుగా నిలవాలి. ఉగ్రమూకలను ఎదుర్కోవడానికి భారతీయులు ఎప్పుడూ ఐక్యమత్యంగా ఉండాలి."
-వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి
1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఉగ్రవాదుల చేతులో హత్యకు గురయ్యారు. ఆయన వర్ధంతి రోజున ఏటా ఉగ్రవాద వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: ఇకపై విమానం ఎక్కాలంటే ఇవి పాటించాల్సిందే