శనివారం ప్రచారకర్తల జాబితాను పార్టీ సీనియర్ నేత రామ్‌గోపాల్ యాదవ్ విడుదల చేశారు. ఇందులో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, నాయకులు ఆజాం ఖాన్, డింపుల్ యాదవ్, జయా బచ్చన్ తదితరులు ఉన్నారు.
ఎన్నికల్లో పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆజాంఘడ్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఎస్పీకి కలిసొచ్చిన మెయిన్‌పురి స్థానం నుంచి ములాయం బరిలో ఉన్నారు. ఇదే స్థానం నుంచి ఇప్పటికే నాలుగు సార్లు గెలిచారు ములాయం.
బీఎస్పీతో పొత్తుతో ఉత్తరప్రదేశ్‌లో 80 స్థానాలకు 37 చోట్ల ఎస్పీ పోటీ చేయనుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 11న మొదలయ్యే ఎన్నికలు మే 19 వరకు కొనసాగుతాయి.
ఇదీ చూడండి:యూపీలో భాజపా 'రాజకీయ ఇంజినీరింగ్'