ఎయిర్ ఇండియా తూర్పు ప్రాంత డైరెక్టర్ కెప్టెన్ రోహిత్ భాసిన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. సిడ్నీ విమానాశ్రయంలోని ఓ దుకాణంలో దొంగతనం చేశారనే ఆరోపణలే కారణం.
జూన్ 22న సిడ్నీ నుంచి దిల్లీ ప్రయాణించిన AI301 విమానానికి రోహిత్ పైలట్‌గా విధులు నిర్వర్తించారు. విమానం టేకాఫ్ అయ్యే ముందు విమానాశ్రయంలోని ఓ దుకాణంలో రోహిత్ వాలెట్ దొంగతనం చేసినట్లు ఫిర్యాదు వచ్చింది. ఈ విషయంపై ఎయిర్ ఇండియా దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు సాగుతోన్న నేపథ్యంలో ఆయనను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియా ఉద్యోగులు నిబద్ధత, సరైన ప్రవర్తన కలిగి ఉండేలా సంస్థ చూస్తుందని.. ఎటువంటి చిన్న తప్పిదాన్నైనా క్షమించబోదని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
- ఇదీ చూడండి: రాజస్థాన్: టెంటు కూలి 15 మంది మృతి